సమాధి నుంచి శవం మాయం.. అమావాస్య రోజున అసలేం జరిగింది?

5 నెలల తర్వాత సమాధి నుంచి శవం మాయమైంది. వర్షానికి ఆ సమాధి గుంతలో నీళ్లు నిండుకున్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి చూస్తే అక్కడ శవం లేదు.

news18-telugu
Updated: July 22, 2020, 4:51 PM IST
సమాధి నుంచి శవం మాయం.. అమావాస్య రోజున అసలేం జరిగింది?
సమాధి నుంచి శవం మాయం
  • Share this:
ఒళ్లు గగుర్పొడిచే ఉదంతమిది..! ఓ సమాధి నుంచి శవం మాయమైంది. ఖననం చేసిన 5 నెలల తర్వాత మృతదేహం అదృశ్యమైంది. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వృద్ధుడి శవం ఎక్కడికి వెళ్లిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోజుకో పుకారులతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మోగ్లా తాలుకా రూగి గ్రామానికి చెందిన తిరమరట్టి రామప్ప అనే (63) ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరి 21న చనిపోయాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన కన్నమూశాడు. ఆ మరుసటి రోజే ఆయన వ్యవసాయ పొలంలోనే ఖననం చేశారు.

సీన్ కట్ చేస్తే..5 నెలల తర్వాత సమాధి నుంచి శవం మాయమైంది. వర్షానికి ఆ సమాధి గుంతలో నీళ్లు నిండుకున్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి చూస్తే అక్కడ శవం లేదు. ఎవరో సమాధిని తవ్వి మృతదేహాన్ని తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. సోమవార అమావాస్య సందర్భంగా గుర్తు తెలయని వ్యక్తులు శవాన్ని తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. క్షుద్రపూజలు చేసే వారే మృతదేహాన్ని తవ్వితీశారని అనుమానిస్తున్నారు. గుప్త నిధులను కనిపెట్టడంలో శవం సాయం చేస్తుందన్న మూఢవిశ్వాసంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాధి నుంచి శవం మాయమైందన్న వార్తతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Published by: Shiva Kumar Addula
First published: July 22, 2020, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading