Home /News /crime /

SOLDIER KILLED IN KOKERNAG GUNFIGHT PVN

J&K : టెర్రరిస్టుల కాల్పుల్లో జవాన్ మృతి

అనంత్ నాగ్ లో ఎన్ కౌంటర్(ప్రతీకాత్మక చిత్రం)

అనంత్ నాగ్ లో ఎన్ కౌంటర్(ప్రతీకాత్మక చిత్రం)

Jawan Killed :  జమ్ము కశ్మీర్​ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలకు-ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతనాగ్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.

Jawan Killed :  జమ్ము కశ్మీర్(Jammu Kashmir)​ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలకు-ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతనాగ్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. అనంతనాగ్(Anantnag) జిల్లాలోని కోకెర్​నాగ్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నషీన్ అనే సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అధికారులు నషీన్ ని హాస్పిటల్ కి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడం వల్ల జవాన్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్(Encounter) కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఇక. కశ్మీర్​ లో మరో సర్పంచ్​ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలోని పట్టన్ నగరంలోని గోష్‌ బుగ్ ప్రాంతంలో స్వతంత్ర సర్పంచ్ మంజూర్ అహ్మద్‌ బాంగ్రూపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్‌ గాయాలైన ఆయనను హాస్పిటల్ కి తరలించగాట్రీట్మెంట్ పొందుతూ మరణించినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. కాగా, ఉగ్రవాదులు ఇటీవల పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. స్థానికేతరులు, కశ్మీర్‌ పండిట్లతోపాటు ముస్లిం ప్రజలపై కూడా కాల్పులు జరుపుతున్నారు.

మరోవైపు,జమ్ముకశ్మీర్‌ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్​ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. షోపియాన్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు(Terrorists) హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా జైనాపోరా ప్రాంతంలోని బడిగ్రామ్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

ALSO READ Bypolls Results: ఉప ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీజేపీ..సత్తా చూపిన టీఎంసీ,కాంగ్రెస్

ఇక, అల్ ​ఖైదా ఉగ్రసంస్థతో తో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ఆరుగురిని శనివారం అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 4న అరెస్టయిన ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరందరికీ అల్​ఖైదా సభ్యుడైన సైఫుల్‌ ఇస్లాం అలియాస్‌ హరున్‌ రషీద్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు గుర్తించామని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Encounter, Jammu and Kashmir

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు