మరదలిపై కన్నేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... తోడల్లుడి హత్య

ప్రతీకాత్మక చిత్రం

తన మరదలిపై కన్నేసిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్... ఇందుకోసం తోడల్లుడిని హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 • Share this:
  మరదలిపై కన్నేసిన ఓ బావ... ఆమె భర్తను చంపాలని ప్లాన్ చేశాడు. అలా చేస్తే... ఆమె తన సొంతమవుతుందని అనుకున్నాడు. ఇందుకోసం పక్కా క్రిమినల్‌లా ఆలోచించాడు. సుపారీ ఇచ్చి ఓ గ్యాంగ్‌ను రంగంలోకి దింపాడు. హైదరాబాద్‌లో ఉంటూ బెంగళూరులో ఉన్న తోడల్లుడు హత్యకు పాన్ చేసిన సత్యప్రసాద్ బండారం పోలీసు విచారణలో వెలుగు చూసింది. నెల్లూరుకు చెందిన సత్యప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఇతడికి 2006లో గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు మాదాపూర్‌లో ఉంటూ వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. సత్య భార్య సోదరి శ్రీజకు గుంటూరుకు చెందిన లక్ష్మణ్‌కుమార్‌తో 2016లో వివాహం జరిగింది. ఆమె కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో ప్రస్తుతం భార్యభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

  కొన్నాళ్లుగా శ్రీజపై కన్నేసిన సత్య ఆమెను లోబరుచుకోవాలని భావించాడు. ఈ విషయం మరదలి కి కూడా చెప్పని అతను లక్ష్మణ్‌ కుమార్‌ను హత్య చేస్తే ఆమె తనకు సొంతమవుతుందని భావించాడు. ఇందుకోసం క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న దినేష్‌ను రంగంలోకి దింపాడు. లక్ష్మణ్ కుమార్‌ను హత్య చేస్తే... రూ.15 లక్షలు, హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్‌ కొనిస్తానని ఆఫర్‌ ఇచ్చాడు. ఇందుకు అంగీకరించిన దినేష్‌ ముందుగా రూ.1.5 లక్షల అడ్వాన్స్‌ తీసుకున్నాడు.

  సుపారీ తీసుకుని రంగంలోకి దిగిన దినేష్‌.. సత్య నుంచి లక్ష్మణ్‌ పొటో, ఇతర వివరాలను తీసుకున్నాడు. గత జూలై 16న బెంగళూరు వెళ్లిన దినేష్‌.. లక్ష్మణ్‌పై దాడి చేశాడు. మెడపై కత్తితో దాడి చేసినా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరోసారి ఈ నెల 3న లక్ష్మణ్‌ ఇంటి వద్ద కాపుకాసిన ఈ దినేష్ గ్యాంగ్‌... మహదేవ్‌పుర ఫ్లైఓవర్‌ వద్ద అతడిని అడ్డగించి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... దినేష్‌ను అరెస్ట్ చేసి సత్యప్రసాద్ బండారం వెలుగులోకి తీసుకొచ్చారు.
  Published by:Kishore Akkaladevi
  First published: