బాకీ తీర్చలేదని ఫ్రెండ్‌ని చంపేశాడు...కారులో తీసుకెళ్లి...

మృతుడి చొక్కా వెనక ఉన్న స్టిక్కర్‌ని చూసి అతడిని బులంద్‌షహర్ (యూపీ)కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు...అతని మిత్రుడు అజయ్ సింగే నిందితుడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

news18-telugu
Updated: June 14, 2019, 9:14 PM IST
బాకీ తీర్చలేదని ఫ్రెండ్‌ని చంపేశాడు...కారులో తీసుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేటి సమాజంలో మానవ సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను దారుణంగా హత్య చేస్తున్నారు. ఆస్తి కోసం తోడబుట్టిన అన్నాదమ్ముళ్లను కడతేరుస్తున్నారు. అలాంటి జనాలకు స్నేహితులు ఓ లెక్కా..! తన బాకీ తీర్చలేదని మిత్రుడిని కిరాతకంగా చంపాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. ఎర్రకోట వెనకాల రక్తపు మడుగులో డెడ్‌బాడీ కనిపించడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్‌ఈస్ట్‌ ఢిల్లీకి చెందిన అజయ్ సింగ్ పీతంపురాలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అజయ్‌సింగ్ తన స్నేహితుడికి రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. ఐతే ఎన్నిసార్లు అడిగినా బాకీ చెల్లించకపోవడంతో ఇరువురి మధ్య పలుమార్లు గొడవ కూడా జరిగింది. ఐనా అతడు డబ్బు చెల్లించలేదు. ఈ క్రమంలో తన స్నేహితుడిపై కక్ష పెంచుకున్న అజయ్ గురువారం రాత్రి అతడిని చితకబాదాడు. ఆ తర్వాత కారులో నిర్బంధించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మృతదేహాన్ని ఎర్రకోట వెనకాల విసిరేసి పారిపోయాడు.

మృతుడి చొక్కా వెనక ఉన్న స్టిక్కర్‌ని చూసి అతడిని బులంద్‌షహర్ (యూపీ)కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు...అతని మిత్రుడు అజయ్ సింగే నిందితుడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>