ఒంగోలులో కీచకుడు...నలుగురు యువతులపై వేధింపులు...

తనకున్న టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళలను వేధించిన ఓ యువకుడిని పోలీసులు కటాకటాల వెనక్కి నెట్టారు.

news18-telugu
Updated: March 13, 2020, 6:36 PM IST
ఒంగోలులో కీచకుడు...నలుగురు యువతులపై వేధింపులు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఉద్యోగం మానేసి సొంతూరు వచ్చిన ఓ యువకుడు... తన నేర ప్రవృత్తిని విస్తరించుకున్నాడు. ఓ కేసులో పోలీసులకు చిక్కిన అతగాడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని పోలీసులు కూడా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్లితే... ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడుకు చెందిన కొల్లూరు చైతన్య బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. అక్కడ కొన్నాళ్లు పనిచేసి స్వగ్రామం తిరిగి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉండటంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ ద్వారా యువతులను, వివాహితులను ట్రాప్ చేయటం మొదలెట్టాడు. అలా పరిచయం అయిన మహిళలను కోరిక తీర్చాలని వేధించడం, కాదన్నవారిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు.

ఒంగోలులోని ఒక షాపింగ్ మాల్‌లో కొద్ది రోజుల క్రితం ఓ యువతి పర్సు పోగొట్టుకుంది. ఆసమయంలో అక్కడ ఉన్న చైతన్య ఆమె పర్సు వెతికి ఆమెకు అందజేశాడు. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నెంబరు తీసుకుని ఆమెతో ఛాటింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఆక్రమంలో ఆమెను శారీరకంగా లొంగదీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో... కటకటాల పాలయ్యారు. అయితే చైతన్యను అరెస్టు చేసినప్పుడు అతడి కారులో పోలీసులకు గంజాయి పాకెట్లు దొరికాయి. విశాఖ నుంచి గంజాయి తీసుకువచ్చి పాకెట్లు కట్టి విక్రయిస్తున్నట్లు చైతన్య వెల్లడించాడు.

చైతన్యపై మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నాగులుప్పలపాడుకు చెందిన క్లాస్ మేట్ ను కూడా ఇలానే లొంగదీసుకునేందుకు యత్నించాడు. వివాహం చేసుకుని వేరే రాష్ట్రంలో ఉంటున్న ఆమెను కోరిక తీర్చాలంటూ వేధించాడు. అంగీకరించకపోవటంతో ఆమెతో మాట్లాడిన ఫోన్ కాల్స్, ఏకాంతంగా ఉన్నప్పటి ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జైలులో చైతన్యకు తమిళనాడుకు చెందిన కార్ల దొంగ సెల్వంతో పరిచయం ఏర్పడింది.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సెల్వ కోసం తమిళనాడు వెళ్లాడు చైతన్య. అక్కడ సెల్వ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఒంగోలులోనూ ఒకవివాహితతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్ర్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు చైతన్యమీద ఆరోపణలున్నాయి. గుంటూరులో మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థినిని ఇదేవిధంగా మోసం చేయడంతో ఆమె తల్లిదండ్రులు దేహశుద్ధి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చైతన్యపై రౌడీ షీట్ తెరిచామని అతడి బాధితులు ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదుచేస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచి అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: March 13, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading