హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gajwel: టెక్ మహీంద్రలో జాబ్.. హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు.. కానీ పాపం భార్య చెప్పిన ఆ ఒక్కమాటతో..

Gajwel: టెక్ మహీంద్రలో జాబ్.. హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు.. కానీ పాపం భార్య చెప్పిన ఆ ఒక్కమాటతో..

పెద్దలు అభ్యంతరం తెలిపినా మూడేళ్ల క్రితం హరీష్, భానుప్రియ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుప్రియను హరీష్ కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. ఈ దంపతులకు పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం వరకూ భార్యబిడ్డను కష్టం రాకుండా చూసుకున్న హరీష్ కొన్ని నెలల నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భార్యతో చీటికీమాటికీ గొడవపడుతుండేవాడు.

పెద్దలు అభ్యంతరం తెలిపినా మూడేళ్ల క్రితం హరీష్, భానుప్రియ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుప్రియను హరీష్ కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. ఈ దంపతులకు పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం వరకూ భార్యబిడ్డను కష్టం రాకుండా చూసుకున్న హరీష్ కొన్ని నెలల నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భార్యతో చీటికీమాటికీ గొడవపడుతుండేవాడు.

2020, డిసెంబర్‌లో గజ్వేల్‌లోని బాలయేసు చర్చిలో ఈ జంటకు పెళ్లి జరిగింది. టెకీగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. పెళ్లయిన వారం రోజుల వరకూ జీవన్‌రెడ్డితో ప్రవళిక అన్యోన్యంగానే ఉంది. వారం రోజుల తర్వాత అమ్మానాన్నలను చూడాలని ఉందని భర్తకు చెప్పింది. జీవన్‌రెడ్డి కూడా భార్యను అర్థం చేసుకుని ...

ఇంకా చదవండి ...

గజ్వేల్: ఆ 28 ఏళ్ల యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. డిసెంబర్‌లో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే.. పెళ్లయిన వారానికి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి రాలేదు. తీసుకురావడానికి ఆ యువకుడు వెళితే.. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదని భార్య చెప్పింది. భార్య చెప్పిన ఆ మాటలకు ఆ యువకుడి గుండె బద్ధలైంది. ఇంటికి వెళ్లి సెల్ఫీ వీడియో తీసి తన భార్య కాపురానికి రాకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు, కుటుంబ సభ్యులకు వీడియో పంపాడు. చివరికి బెడ్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గజ్వేల్ పట్టణానికి చెందిన శౌరెడ్డి, పోతిరెడ్డి సుందరిల కుమారుడు జీవన్‌‌రెడ్డి(28) హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఐదంకెల జీతం. అందమైన జీవితం. ఇక.. కొడుకుకు పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఓ సంబంధం ఉందని తెలుసుకున్నారు. అమ్మాయిని చూసేందుకు వెళ్లారు. ఆమె జీవన్‌రెడ్డికి కూడా నచ్చడంతో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. తనకు పెళ్లి ఇష్టం లేని విషయాన్ని ప్రవళిక ఆ సమయంలో చెప్పలేదు. ‘మీ ఇష్టమే.. నా ఇష్టం’ అన్నట్టుగా తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉంది. ప్రేమ వ్యవహారం కారణమో లేక ఇతర కారణం ఏమైనా ఉందో తెలియదు గానీ ప్రవళిక అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇరు కుటుంబాలకు సమ్మతం కావడంతో జీవన్‌రెడ్డి, ప్రవళిక వివాహం జరిగింది. 2020, డిసెంబర్‌లో గజ్వేల్‌లోని బాలయేసు చర్చిలో ఈ జంటకు పెళ్లి జరిగింది. టెకీగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. పెళ్లయిన వారం రోజుల వరకూ జీవన్‌రెడ్డితో ప్రవళిక అన్యోన్యంగానే ఉంది. వారం రోజుల తర్వాత అమ్మానాన్నలను చూడాలని ఉందని భర్తకు చెప్పింది. జీవన్‌రెడ్డి కూడా భార్యను అర్థం చేసుకుని ఆమెను అత్తగారింట్లో దిగబెట్టి వచ్చాడు. వారం గడిచింది. అయినా ప్రవళిక తిరిగి రాలేదు. ఈలోపు.. జీవన్‌రెడ్డి ఆమెతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ.. ఏ ఒక్క సందర్భంలోనూ తనకు రావడం ఇష్టం లేదని ప్రవళిక చెప్పలేదు.

కానీ.. ఈ క్రమంలోనే ఒకరోజు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, తనకు రావడం ఇష్టం లేదని.. నీతో కలిసి ఉండలేనని జీవన్‌రెడ్డికి ప్రవళిక తెగేసి చెప్పింది. జీవన్‌రెడ్డికి ఒక్కసారిగా గుండె బద్ధలైనట్టు అనిపించింది. తన భార్యను ఎంతగానో ప్రేమించిన జీవన్ ఆమె మాటలతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇక.. ఆమె లేని జీవితం వ్యర్థమనుకున్నాడు. తన భార్య కాపురానికి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు, బంధువులకు వాట్సాప్‌లో పంపించాడు.

Gajwel, Tech Mahindra, Techie, Software Employee, Newly Married, Suicide
జీవన్ రెడ్డి

దీంతో.. కంగారు పడిన కుటుంబ సభ్యులు జీవన్‌రెడ్డి బెడ్‌రూమ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల లాక్ చేసి ఉంది. డోర్ బద్ధలుకొట్టి వెళ్లగా ఉరేసుకుని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ జీవన్‌రెడ్డి కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కొడుకు మృతితో జీవన్‌రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. జీవన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Gajwel, Tech Mahindra