హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

తన ఉద్యోగం పోతుందన్న భయంతో హాస్టల్ రూంలోనే ఆమె చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: November 20, 2019, 12:47 PM IST
హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి హాస్టల్‌లో ఉంటున్న హరిణి అనే యువతి ఉరివేసుకొని ప్రాణం తీసుకుంది. అయితే ఉద్యోగం పోతుందన్న భయంతోనే హరిణి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్లుగా మాదాపూర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో హరిణి ఉద్యోగం చేస్తోంది. ఒప్పందం ప్రకారం డిసెంబర్‌తో కాంట్రాక్టు ముగుస్తుంది. దీంతో తన ఉద్యోగం పోతుందన్న భయంతో హాస్టల్ రూంలోనే ఆమె చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిన్నరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హరిణిది మహబూబ్ నగర్ జిల్లాగా పోలీసులు గుర్తించారు. కటుంబ సభ్యులకు సమచాారం అందించారు.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...