Home /News /crime /

SOFTWARE EMPLOYEE COMMITS SUICIDE ALONG WITH 10 YEAR OLD DAUGHTER WITH FINANCIAL PROBLEMS AND DEPRESSION IN VIJAYAWADA HSN

Vijayawada: భార్యకు వైద్యం కూడా చేయించలేని ఈ బతుకెందుకంటూ.. కూతురితో కలిసి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణం..!

ఆత్మహత్యకు పాల్పడ్డ తంత్రీకూతుళ్లు

ఆత్మహత్యకు పాల్పడ్డ తంత్రీకూతుళ్లు

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. కరోనా కారణంగా ఉద్యోగం మానేసి విజయవాడకు వచ్చిన అతడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. సాయం చేసేవాళ్లు లేక, అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు చికిత్స కూడా చేయించలేక..

  ‘నా కిడ్నీలను నా భార్యకు దానం చేయండి. మిగిలిన అవయవాలను అవసరం ఉన్నవారికి ఇవ్వండి’ అంటూ రాసిన లేఖలను గోడపై అంటించి మరీ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడితోపాటు పదేళ్ల కుమార్తె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ’ఐ నీడ్ హెల్ప్ మామ్మా‘ అంటూ తన అమ్మమ్మ ఫొటో వద్ద స్ప్రేతో అతడు రాశాడు. విజయవాడలో శనివారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీ రెండో లైన్ కు చెందిన 40 ఏళ్ల జగాని రవి, తన భార్య భరణి, పదేళ్ల కుమార్తె గీతా సహస్రతో కలిసి జీవిస్తున్నాడు. వాస్తవానికి రవి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లో ఉద్యోగం మానేసి విజయవాడకు వచ్చేశాడు.

  రవి భార్య భరణి కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు డయాలసిస్ వైద్యం జరుగుతోంది. గవర్నర్ పేటలోని తన పుట్టింట్లో ఉంటూ భరణి తరచూ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటోంది. ఈ కారణంగా రవి తన కుమార్తె సహస్రతో కలిసి ఉంటున్నాడు. శనివారం ఉదయం బావమరిది మధుబాబు రవికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో ఆయన రవి ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో స్థానికుల సాయంతో బద్దలు కొట్టి మరీ లోపలకు వెళ్లాడు. బెడ్రూంలో ఉరికి వేలాడుతున్న రవి, మంచంపై నిర్జీవంగా పడి ఉన్న గీతా సహస్ర మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  బాలిక నోటికి ప్లాస్టర్ అంటించి, రవి ముఖానికి నల్లటి వస్త్రాన్ని చుట్టి కాళ్లు చేతులు కట్టేసి మరీ ఉన్న స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. చూస్తే ఎవరైనా హత్య చేశారా? అన్న భావన కూడా కలుగుతోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కారణంగా ఉద్యోగం పోవడం, భార్య అనారోగ్యంతో బాధపడటంతోపాటు ఆర్థిక ఇబ్బందులు, పెంచిన అమ్మమ్మ మరణం వంటివి రవిలో మానసిక ఒత్తిడిని కలగజేసి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యకు కనీసం వైద్య చికిత్సలు కూడా చేయించలేకపోతున్నాననీ, వాళ్ల పుట్టింటి వాళ్లే ఖర్చులను భరిస్తున్నారని ఆవేదనకు గురి అయ్యాడు.
  ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

  కాగా, వాళ్లిద్దరూ చనిపోయిన గదిలో గోడలకు నాలుగు లేఖలు అంటించి ఉన్నాయి. ‘నిన్న అందరూ వచ్చారు. కానీ నాతో ఒక్కరు కూడా మాట్లాడలేదు. మొన్ననే ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించా. సారీ బుజ్జీ. నువ్వు బెటర్ లైఫ్ కోసం కలలు కన్నావు. కానీ ఇలా ఒంటరితనాన్ని కాదు. నా అవయవాలను నా భార్య భరణికి దానం చేయండి. ఇతర అవయవాలను అవసరం ఉన్నవారికి ఇచ్చేయండి‘ అని ఆ లేఖలపై రాసి ఉంది. అదే గదిలో ఉన్న అతడి అమ్మమ్మ ఫొటో వద్ద ‘ఐ నీడ్ హెల్ప్.. మామ్మా’ అని కూడా రాసి ఉంది. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని మరో లేఖలో రాశాడు. కూతురిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ‘సారీ బుజ్జితల్లీ‘ అని కూడా రాశాడు. ‘ఐలవ్యూ అమ్మమ్మ, ఐలవ్యూ ఉమా పిన్నీ. ఐ లవ్యూ బుజ్జితల్లీ. సారీ తల్లి‘ అని రాశాడు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Vijayawada

  తదుపరి వార్తలు