Home /News /crime /

SO MANY DOUBTS IN SIX YEAR OLD BOY MURDER CASE IN TADEPALLI GUNTUR POLICE FILED CASE FULL DETAILS HERE HSN

కోతులా..? రా’బంధువుల‘ పనా..? ఆరేళ్ల బాలుడి మర్డర్ కేసులో అనుమానాలెన్నో.. చేతి వేళ్లను, కాళ్లను విరగ్గొట్టి.. ముఖాన్ని రక్కేసి..

హత్యకు గురయిన భార్గవ తేజ

హత్యకు గురయిన భార్గవ తేజ

తాడేపల్లిలో ఆరేళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేకెత్తిస్తోంది. ఇంట్లోంచి అదృశ్యమయిన బాలుడు 24 గంటల్లోనే ఇంటికి కాస్త దూరంలో ఉన్న పొలంలో నిర్జీవంగా పడి ఉండటంతో ఊరంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది..

    తాడేపల్లిలో ఆరేళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేకెత్తిస్తోంది. ఇంట్లోంచి అదృశ్యమయిన బాలుడు 24 గంటల్లోనే ఇంటికి కాస్త దూరంలో ఉన్న పొలంలో నిర్జీవంగా పడి ఉండటంతో ఊరంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అభం శుభం తెలియని బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఈ హత్యకు కారణాలేంటన్న దానిపై అటు ఊళ్లోనూ ఇటు పోలీసుల్లోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడిలో భాగవానియా నాయక్, అమల దంపతులకు ఇద్దరు కొడుకులు. ఈ దంపతుల రెండో కుమారుడు, ఆరేళ్ల భార్గవ తేజ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. బంధువులు, స్నేహితులు ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటారని మొదట్లో ఆ తల్లిదండ్రులు భావించారు.

    కానీ ఎవరిని కనుక్కున్నా తమకు తెలియదని అంటుండటంతో వారిలో ఆందోళన పెరిగింది. కొడుకు కనిపించకుండా పోవడంతో వారిలో టెన్షన్ పెరిగింది. చివరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు ఆ భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. తమ కొడుకు అదృశ్యం గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆ తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. వారి ఇంటికి కాస్త దగ్గరలోనే పొలాల్లో ఆ ఆరేళ్ల బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. తల్లిదండ్రులు ఆ వార్త తెలిసి ఉరుకులు పరుగుల మీద అక్కడకు చేరుకున్నారు. బాలుడిని నిర్జీవంగా చూసి కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడి హత్య గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి ఊళ్లోనూ, కుటుంబ సభ్యుల్లోనూ విచారణ ప్రారంభించారు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    అయితే బాలుడి మృతి గురించి భిన్న కథనాలు వెలువడుతుండటం గమనార్హం. అందులో ఓ కారణం మరీ వినడానికి చాలా వింతగానూ ఉంది. బాలుడిని కోతులు చంపాయని కొందరు చెప్పుకుంటున్నారు. అయితే కోతులే కనుక అలాంటి పని చేసినట్టయితే బాలుడి ఒంటిపై ఉన్న దుస్తులు కూడా చిందరవందర అయ్యేవి. కానీ బాలుడి ఒంటిపై దుస్తులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కావాలనే ఎవరో బాలుడిని చంపి పొలాల్లోకి తీసుకొచ్చి పడేసినట్టు తెలుస్తోంది. మృతదేహంపై, ముఖంపై రక్కేశారు. చేతి వేళ్లను విరిచేశారు. కాళ్లను కూడా విరగ్గొట్టారు. ఎక్కడో హత్య చేసి పొలాల్లోకి తీసుకొచ్చి పడేసినట్టు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Guntur, Tadepalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు