Snake bite 5 times : పాము పగబడితే జన్మజన్మలకు అది తొలగిపోదని నమ్ముతుంటారు. ఇది నిజమే అనిపించేలా ఇప్పటికే చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజజీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని అగ్రా జిల్లాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని 10 రోజుల్లో 5 సార్లు పాము కాటేసింది(Snake Bitten 5 times). అయితే అన్నిసార్లూ ఒకే పాము,ఒకే చోట కాటేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది
ఆగ్రా(Agra) జిల్లాలోని మన్‌కేఢా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం రజత్ చాహర్ ఇంటి బయట వాకింగ్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ కాలుపై ఓ పాము కాటేసి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు చాహర్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 4 గంటలపాటు అతడి పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని డాక్టర్లు రజత్ ను ఇంటికి పంపేశారు. రెండు రోజుల తర్వాత సాయంత్రం పూట ఇంటి బయట ఉన్న బాత్రూమ్ కు వెళ్లిన రజత్ ఎడమ కాలిపై మరోసారు అదే పాము కాటేసింది. రజత్ ని హుటాహుటిన ముబారక్పుర్ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేయించారు.
Breaking : ఘోర విషాదం..గోడ కూలి 10మంది మృతి
అయినా ఆ పాము రజత్ ని విడిచి పెట్టలేదు. ఈ నెల 11న రజత్ తన ఇంట్లోని ఓ గదిలో ఉండగా అతడి ఎడమ కాలిపై మరోసారు అదే పాము కాటేసింది. వెంటనే అదే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు కుటుంబసభ్యులు. మళ్లీ ఈ నెల 13న బాత్రూమ్లో ఉండగా ఓసారి, 14న చెప్పులు వేసుకుంటుండగా మరోసారి రజత్ ను పాము అదే పాము అదే ఎడమకాలిపై కరిచింది. అయితే సమయానికి ట్రీట్మెంట్ అందుతూ రజత్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతోందనని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రజత్ చాహర్ విషయం గురించి తెలిసిన గ్రామస్థులు అతడి ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ పాము రజత్ పై పగబట్టిన విషయం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake, Snake bite, Uttar pradesh