Home /News /crime /

SMUGGLING GANG BUSTED IN GARIABAND TWO GIRLS ARRESTED WITH 30 KG GANJA SK

పెళ్లి కారును చెక్‌చేసిన పోలీసులు.. లోపల ఇద్దరు అమ్మాయిలు.. వారేం చేస్తున్నారో తెలుసా?

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

Ganja Smuggling: కారుకు పెళ్లి స్టిక్కర్‌ను అంటించి గతంలోనూ పలు మార్లు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు డౌట్ రాకుండా అమ్మాయిలను చూపించి.. పెళ్లికి వెళ్తున్నట్లుగా నమ్మిస్తున్నారు.

  మన దేశంలో గంజాయి అక్రమ రవాణా (Ganja Smuggling)  బాగా పెరిగిపోయింది. ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా అక్రమార్కులు గంజాయిని సరిహద్దులు దాటించేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు పోలీసులతో కుమ్మక్కైతే.. మరికొందరు వారు కళ్లు గప్పి..గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ పోలీసులు స్మగ్లింగ్ ముఠా (Ganja Gang)  గుట్టు రట్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో బాలికలు పట్టుబడడం ఇదే తొలిసారని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ఓ కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో.. సోమవారం జిల్లా కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు అక్కడికి వచ్చింది. పోలీసులు ఆపితే.. ''ఇది పెళ్లి కారు.. ఏమీ లేవు. మమ్మల్ని వదలిపెట్టండి'' అని  అడిగారు. కానీ పోలీసులు అందరినీ చెక్ చేయాల్సిందేని చెప్పి.. కారు లోపల తనిఖీ చేశారు. అంతే లోపల గంజాయి ప్యాకెట్లు దొరకడంతో పోలీసులు షాక్ తిన్నారు.

  హైదరాబాద్​ డ్రగ్స్​ కేసులో మరో ట్విస్టు.. ఆ ఏడుగురితో పాటు మరో 15 మంది బడా వ్యాపారులు?

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జనవరి 24న బొలెరో వాహనం (OR-08-E-2262)లో ఒడిశా నుంచి రాయ్‌పూర్‌ వెళ్తోంది. ఈ క్రమంలోనే గరియాబంద్‌ పోలీసులు రోడ్డుపై తనిఖీలు చేపట్టారు. అప్పుడే ఆ బొలెరో వాహనం వచ్చింది. దానిపై పెళ్లి స్టిక్కర్ అంటించి ఉండడంతో పెళ్లి వాహనమని అనుకున్నారు. వారు కూడా అదే సమాధానం చెప్పారు. సమీప బంధువుల పెళ్లి ఉందని అక్కడికి వెళ్తున్నామని చెప్పారు. ఐనప్పటికీ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 30 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులు  ఈ గంజాయిని ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు గంజాయిని తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది.

  భర్త బయటకు వెళ్లగానే.. పక్కింటి వ్యక్తితో భార్య రాసలీలు.. చూసి తట్టుకోలేక అతడు ఏం చేశాడంటే

  30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉండడం విశేషం. అరెస్టైన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన సహదేవ్ గిరి (23), సుభాష్ చంద్ర నాయక్ (46), ఒడిశాకు చెందిన ఆర్బీ సోని (26), రూబీ సోని (22)గా గుర్తించారు. వీరు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి బొలెరో వాహనంలో మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి ధర దాదాపు రూ.3 లక్షలు. గంజాయితో పాటు రూ.10,00,000 విలువైన కారు, రూ.22 వేల విలువైన నాలుగు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.13 లక్షలు. విచారణ అనంతరం నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌పై జైలుకు తరలించారు.

  WhatsApp Group: నగల దొంగల్ని పట్టిచ్చిన వాట్సప్ గ్రూప్... ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే

  కారుకు పెళ్లి స్టిక్కర్‌ను అంటించి గతంలోనూ పలు మార్లు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు డౌట్ రాకుండా అమ్మాయిలను చూపించి.. పెళ్లికి వెళ్తున్నట్లుగా నమ్మిస్తున్నారని భావిస్తున్నారు.  ఈ కేసును ఛత్తీస్‌గఢ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.ఒడిశా, మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి ఈ అంతర్ రాష్ట్ర ముఠా ఆటకట్టించే పనిలో ఉన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Ganja case, Ganja smuggling, Odisha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు