బంగారం స్మగ్లింగ్‌లో కొత్త ట్విస్ట్... యాత్రీకులే టార్గెట్

Gold Smuggling | తక్కువ ధరకే ఉమ్రా యాత్రకు తీసుకెళతామని పాతబస్తీలోని ముస్లింలకు ఆఫర్ చేస్తున్న పలువురు స్మగ్లర్లు... అక్కడికి వెళ్లిన తరువాత వారితో బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్నట్టు విచారణలో తేలింది.

news18-telugu
Updated: July 3, 2019, 2:40 PM IST
బంగారం స్మగ్లింగ్‌లో కొత్త ట్విస్ట్... యాత్రీకులే టార్గెట్
ఉమ్రా యాత్రీకులు తీసుకొచ్చిన బంగారం
  • Share this:
శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఉమ్రా యాత్ర నుంచి తిరిగొచ్చిన 14 మంది నుంచి దాదాపు రూ. 2.7 కోట్ల విలువైన ఆరున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు. నిందితులను విచారించిన క్రమంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. తక్కువ ధరకే ఉమ్రా యాత్రకు తీసుకెళతామని పాతబస్తీలోని ముస్లింలకు ఆఫర్ చేస్తున్న పలువురు స్మగ్లర్లు... అక్కడికి వెళ్లిన తరువాత వారితో బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్నట్టు విచారణలో తేలింది. తాజాగా ఇదే రకంగా జెడ్డాలోని ఉమ్రా యాత్రకు వెళ్లిన 16 మంది సభ్యులను స్మగ్లర్లు బంగారం స్మగ్లింగ్ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు.

వారిని చిత్రహింసలు పెట్టారు.తాము ఇచ్చిన బంగారాన్ని హైదరాబాద్‌లో డెలివరీ చేయాలని మూడు రోజుల పాటు హింసించారు. తాము చెప్పినట్టు వినకపోతే అక్రమంగా జెడ్డా వచ్చారని పోలీసులకు అప్పగిస్తామని వారిని బెదిరింపులకు గురి చేశారు. స్మగ్లర్లకు భయపడి వాళ్లు ఇచ్చిన బంగారాన్ని తమతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చిన ఉమ్రా యాత్రికులు... టాస్క్ ఫోర్స్, డీఆర్ఐ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో దొరికిపోయినట్టు అధికారులు వెల్లడించారు.


First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>