SLUG SEIZURE OF NATSARA RAW MATERIAL DUMP ON AGRICULTURAL LAND IN NAGARKURNOOL DISTRICT SNR
రైతు పొలంలో నేలమాళిగలు..బయటపడ్డ వాటిని చూసి షాకైన పోలీసులు
భూమిలో నిల్వచేసిన బెల్లం
Nagarkurnool: నాటుసారా, గుడుంబా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాలను పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ పోలీసుల కంట పడకుండా వ్యవసాయ భూమిలో గొయ్యి తొవ్వి అందులో అక్రమంగా డంప్‌ని నిల్వ చేశాడు రైతు. పోలీసుల మెరుపు దాడుల్లో పెద్ద మొత్తంలో బెల్ల, పటికను స్వాధీనం చేసుకున్నారు.
ఎక్కడైనా నాటు సారాను, సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని డబ్బాల్లో , టిన్నుల్లో, డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ చేయడం చూశాం. కాని మొదటిసారి నాగర్ కర్నూల్ (Nagarkurnool)జిల్లాలో నాటు సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని భూమిలో గొయ్యి తొవ్వి అందులో నిల్వ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల (Uppununthala)మండలం వెల్టూరు (Veltur)లో అక్రమ డంప్ బయటపడింది. భూమిలో నేలమాళిగల్ని దాచినట్లుగా పెద్ద డంప్‌ని ..అక్రమంగా నిల్వ ఉంచిన డంపులో 75 సంచుల(75 bags) బెల్లం (Jaggery)రెండు సంచుల(2 bags) పటిక(Acacia)ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పునుంతల మండలం వెల్టూరులోని సూర్య తండకు చెందిన హతిరామ్ (Hathiram)అనే వ్యక్తి తన వ్యవసాయ భూమి(Agricultural land)లో నాటుసారా తయారికి ఉపయోగించే పదార్ధాల డంప్‌ని భూమిలో పాతిపెట్టినగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని పరిసరాల్ని పరిశీలించారు. ముందు పొలం చుట్టుపక్కల తనిఖీలు చేసిన పోలీసులు ఎక్కడా నాటుసారా బెల్లం, పటిక నిల్వ చేసినట్లుగా దొరక్కపోవడంతో ఉప్పునుంతల ఎస్సై శేఖర్ గౌడ్ వ్యవసాయ భూమిలో ఓ పక్కన గొయ్యి తొవ్వి దానిపై నల్లటి పట్టా వేసినట్లుగా ఉండటాన్ని గమనించి అందులోకి దిగడంతో సారా డంప్ బయటపడింది. డంప్‌లో దాచిపెట్టిన 75సంతుల నల్లబెల్లం, రెండు సంచుల పటికను బయటకు తీయించారు పోలీసులు. వాటిని ట్రాక్టర్లో పోలీస్ స్టేషన్(Police station)కు తరలించారు. రైతు హత్తి రామ్ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన డంపును గుర్తించి బయటకు తీసిన 75 సంచుల గుడుంబా బెల్లంతో పాటు రెండు సంచుల పటికను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు ఉప్పునుంతల ఎస్సై శేఖర్ గౌడ్ ఇతర పోలీసు సిబ్బంది.
ఏం ఐడియారా బాబు నీది..
నాటు సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల డంప్‌ని వ్యవసాయ భూమిలో అక్రమంగా నిల్వ చేసిన రైతు హతిరామ్ను తెల్కపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు ఉప్పునుంతల పోలీసులు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామ సమీపంలోని సూర్య తండతో పాటు చుట్టు పక్కల కూడా ఇంకా ఏమైనా ఇలాంటి డంప్‌లు దాచిపెట్టారా అనే విషయాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. తండాల సమీపంలోని వ్యవసాయ పొలాల్లో తనిఖీలు చేస్తున్నారు.
అడ్డంగా దొరికిపోయన అక్రమార్కులు..
అక్రమార్కులు పోలీసుల కళ్లు గప్పి దందాలు చేస్తుంటే ..పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు ఇలా మెరుగు దాడులు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో గతంలో గంజాయి, గుట్కా డంప్‌లపై నిఘా పెట్టిన అధికారులు ఇప్పుడు నాటుసారా ముడి పదార్ధాల అక్రమ నిల్వలను బయటకు తీసే పనిలో పడ్డారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.