ఇన్సూరెన్స్ కోసం చేతిని కట్ చేసుకున్న మహిళ.. కానీ చివరకు ఏమైదంటే..

మోసపూరిత పద్ధతిలో ఇన్సూరెస్స్ క్లెయిమ్ చేయాలని చూసిన ఓ మహిళకు గట్టి షాక్ తగిలింది. ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా చేసిందని తేలడంతో.. న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

news18-telugu
Updated: September 13, 2020, 10:24 AM IST
ఇన్సూరెన్స్ కోసం చేతిని కట్ చేసుకున్న మహిళ.. కానీ చివరకు ఏమైదంటే..
జూలిజా అడ్లెసిక్(Julija Adlesic)
  • Share this:
మోసపూరిత పద్ధతిలో ఇన్సూరెస్స్ క్లెయిమ్ చేయాలని చూసిన ఓ మహిళకు గట్టి షాక్ తగిలింది. ఆమెకు  న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా ఆమె తన ఎడమ చేతిని కట్ చేసుకుని డబ్బుల పొందాలని చూసినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటన స్లోవేనియాలో చోటుచేసుకుంది. వివరాలు.. జూలిజా అడ్లెసిక్ అనే 22 ఏళ్ల మహిళ గతేడాది ఐదు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంది. ఆ తర్వాత భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామనే ఉద్దేశంతో.. రంపంతో తన చేతిని కట్ చేసుకుని హాస్పిటల్‌లో చేరింది.

కొమ్మలను కట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. కట్ అయిన చేతి భాగాన్ని అక్కడ వదిలేసి రావడం ద్వారా వైద్యలు తనకు శాశ్వత వైకల్యంగా నిర్ధారిస్తారని భావించింది. అయితే పోలీసులు చేతి భాగాన్ని స్వాధీనం చేసుకుని.. తిరిగి అతికించేలా చేశారు. మరోవైపు ఈ ఘటనకు ముందు జూలిజా బాయ్‌ఫ్రెండ్ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్‌కు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వేతికినట్టు అధికారులు గుర్తించారు. జూలిజా ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందనేందుకు ఆధారాలు సేకరించారు.

అయితే ఈ కేసు విచారణ సందర్భంగా మాత్రం జూలిజా తనకు ఏ నేరం తెలియదన్నట్టుగా అమాయకత్వాన్ని ప్రదర్శించింది. ఉద్దేశపూర్వకంగా తన చేతిని కత్తిరించుకోలేదని తెలిపింది. ఎవరు కూడా వికలాంగులుగా ఉండటానికి ఇష్టపడరని ఆవేదన వ్యక్తం చేసింది. చేతిని కోల్పోవడం ద్వారా తన యవ్వనం నాశనమైందని.. అది ఎలా జరిగిందో తనకు మాత్రమే తెలుసునని అంది. మరోవైపు ఈ కేసులో జూలిజా కు సహకరించినందకు గాను..  ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
Published by: Sumanth Kanukula
First published: September 13, 2020, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading