హైదరాబాద్‌లో మరో కలకలం... ఇసుకలో మహిళ అస్థిపంజరం...

పుర్రె దొరికిన ప్రాంతంలో ఇంకా తవ్విచూడగా, అక్కడ అస్థిపంజరం, గాజులు, చీర కనిపించాయి. ఓ రుద్రాక్ష మాల కూడా కనిపించింది.

news18-telugu
Updated: December 14, 2019, 7:16 PM IST
హైదరాబాద్‌లో మరో కలకలం... ఇసుకలో మహిళ అస్థిపంజరం...
పుర్రె (నమూనా చిత్రం)
  • Share this:
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో మరో కలకలం రేగంది. ఇసుకలో ఓ మహిళ అస్థిపంజరం బయటపడింది. ఇసుక అవసరమైన వారి కోసం టీఎస్ఎండీసీ హైదరాబాద్ శివారులో ఇసుక స్టాక్ యార్డ్ నిర్వహిస్తుంది. భవన నిర్మాణాల కోసం ఇసుక కావాలనుకునే వారు నేరుగా టీఎస్ఎండీసీకి డబ్బులు చెల్లించి, వారు ఆ ఇసుకను కొనుక్కోవచ్చు. వనస్థలిపురానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ రకంగా టీఎస్ఎండీసీకి డబ్బులు చెల్లించి, ఆ డీడీని తీసుకుని ఇసుక స్టాక్ యార్డుకు వెళ్లాడు. అయితే, అక్కడ లారీలోకి ఇసుకను లోడ్ చేస్తున్న సమయంలో ఓ పుర్రె కనిపించింది. దీంతో అతడు తనకు ఇసుక వద్దని చెప్పి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు.

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రంగంలోకి దిగి స్టాక్ యార్డ్‌ను పరిశీలించారు. పుర్రె దొరికిన ప్రాంతంలో ఇంకా తవ్విచూడగా, అక్కడ అస్థిపంజరం, గాజులు, చీర కనిపించాయి. ఓ రుద్రాక్ష మాల కూడా కనిపించింది. దీంతో ఆ అస్థిపంజరం మహిళదై ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ఇసుకను ఏడు నెలల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 14, 2019, 7:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading