నాలుగేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్దుడి అత్యాచారయత్నం..

పిల్లలంతా ప్రసాదం తినుకుంటూ సమీపంలోని నూకాలమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అప్పల నాయుడు అనే వృద్దుడు చిన్నారిని మాయ మాటలతో ఆలయం వెనక్కి తీసుకెళ్లాడు.

news18-telugu
Updated: September 13, 2019, 7:19 AM IST
నాలుగేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్దుడి అత్యాచారయత్నం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు మొదలు వృద్ద మహిళలు కూడా అత్యాచారానికి గురవుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా ఎండాడలో అప్పలనాయుడు(60) అనే వృద్దుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

స్థానిక భువనేశ్వర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మంటపంలో సమారాధన పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో కొందరు పిల్లలతో కలిసి బాధిత బాలిక అక్కడికి వెళ్లింది. పిల్లలంతా ప్రసాదం తినుకుంటూ సమీపంలోని నూకాలమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అప్పల నాయుడు అనే వృద్దుడు చిన్నారిని మాయ మాటలతో ఆలయం వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా కొందరు యువకులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>