హోమ్ /వార్తలు /క్రైమ్ /

Nizamabad: చెట్టును ఢీకొట్టిన బైక్.. కూతురు మృతి.. తండ్రి సేఫ్.. ఇది ప్రమాదమా? హత్యా?

Nizamabad: చెట్టును ఢీకొట్టిన బైక్.. కూతురు మృతి.. తండ్రి సేఫ్.. ఇది ప్రమాదమా? హత్యా?

చెట్టును ఢీకొన్న బైక్

చెట్టును ఢీకొన్న బైక్

Nizamabad Accident: శ్రీవ‌ల్లికి గ‌త నాలుగు రోజులుగా జ్వ‌రం వ‌చ్చింది. అయితే అన్నం తిన‌కపోతే నిన్ను చంపేస్తానని తండ్రి న‌ర్స‌య్య కోప్పడ్డాడని ... అన్న‌ట్టుగానే చంపేశాడ‌ని తల్లి రోదించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Nizamabad

(పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి, నిజామాబాద్ జిల్లా)

ఉద‌యం స్కూల్ కు వెళ్లిన చిన్నారి అస్వ‌స్థతకు గురైంది. స్కూల్ యాజ‌మాన్యం అప్రమత్తమై చిన్నారి తండ్రికి ఫోన్ చేసి విష‌యం చెప్పారు. కూతురిని తీసుకు రావాడానికి తండ్రి వెంటనే బైక్‌పై బయలుదేరాడు. ఆమెను తీసుకొని ఇంటికి వస్తుండగా..ఘోరం జరిగింది. బైక్ (Bike Accident) అదుపు తప్పి కిందపడడంతో.. చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఐతే ఈ ప్రమాదంపై తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. తన భర్తే కూతురిని చంపేసి ఉంటాడని ఆరోపిస్తోంది. ఇది ప్రమాదమా? హత్యా? ఒకవేళ హత్యే అయితే.. కన్న కూతురిని చంపాల్సిన అవసరం ఆ తండ్రికి ఎందుకొచ్చింది?

Telangana: ఫ్రీ..:ఫ్రీ..ఫ్రీ.. మటన్ కొంటే చికెన్ ఉచితం.. అదిరిపోయే ఆఫర్.. ఎక్కడంటే

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ (Nizamabad) జిల్లా ధ‌ర్ప‌ల్లి మండ‌లం రేకులపల్లి గ్రామానికిచెందిన నర్సయ్య, లక్ష్మికి శ్రీవల్లి అనే ఆరేళ్ల కూతురు ఉంది ఆ చిన్నారి సిరికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. బుధవారం ఉదయం పాప స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లింది. ఐతే కొండూరు వరకు రాగానే బస్సులో వాంతులు చేసుకొని అస్వస్థ తకు గురైంది. వెంటనే స్కూల్ సిబ్బంది శ్రీవ‌ల్లి తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. పాప తండ్రి నర్సయ్య హుటాహుటిన పాఠశాలకు వెళ్లాడు. కూతురుని బైక్ పై తీసుకుని ఇంటికి వ‌స్తుండగా.. సిరికొండ మండలం పోత్నూర్ శివారులో  బైక్ చెట్టును ఢీ కొట్టింది.  బైక్‌పై నుంచి పడిన శ్రీవల్లి అక్క‌డికి అక్క‌డే మృతి మృతి చెందింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లోనే మరణించింది. తండ్రి నర్సయ్యకు మాత్రం స్వల్ప గాయాలే అయ్యాయి. స్థలానికి చేరుకున్న తల్లి తమ కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది.

ఇది ప్రమాదం అయి ఉండదని.. తండ్రే చంపి ఉంటానని అనుమానం వ్యక్తం చేసిది లక్ష్మి. తన భర్తే కూతురున్ని చంపి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. న‌ర్స‌య్య‌కు ఇద్ద‌రు భార్య‌లు. మొద‌టి భార్య బిడ్డ పుట్ట‌గానే ఉరి వేసుకుని చనిపోయింది. ఆ త‌రువాత లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు నర్సయ్య. లక్ష్మికి ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆమె పెద్ద కూతురే ఈ చిన్నారి. శ్రీవ‌ల్లికి గ‌త నాలుగు రోజులుగా జ్వ‌రం వ‌చ్చింది. అయితే అన్నం తిన‌కపోతే నిన్ను చంపేస్తానని తండ్రి న‌ర్స‌య్య కోప్పడ్డాడని ... అన్న‌ట్టుగానే చంపేశాడ‌ని తల్లి రోదించింది. ఘటనపై పోలీసులు అనుమాన‌స్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవ‌ల్లి మృతి ఆక్సిండెంట్ వ‌ల్ల చ‌నిపోయిందా.. లేక మ‌ర్డ‌రా అనే కోణంలో విచారిస్తున్నామ‌ని సిరికొండ ఎస్ఐ న‌ర్సింహులు తెలిపారు.

First published:

Tags: Nizamabad, Road accident, Telangana

ఉత్తమ కథలు