హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఓ వైపు అమ్మమ్మ.. మరో వైపు తల్లి.. పట్టాలపై ఆగి ఉన్న రైలు కింద నుంచి వెళ్లేందుకు యత్నించిన ఆరేళ్ల బాలిక.. క్షణాల్లోనే ఘోరం..!

ఓ వైపు అమ్మమ్మ.. మరో వైపు తల్లి.. పట్టాలపై ఆగి ఉన్న రైలు కింద నుంచి వెళ్లేందుకు యత్నించిన ఆరేళ్ల బాలిక.. క్షణాల్లోనే ఘోరం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటికి వెళ్లాలంటే రైలు పట్టాలను దాటడం ఒక్కటే దారి. అందుకే ఆ ముగ్గురూ అదే దారిని అనుసరించారు. మొదటగా అమ్మమ్మ ఆగి ఉన్న రైలు కింద నుంచి వెళ్లింది. తర్వాత తల్లి అటు వైపే ఉండి ఆరేళ్ల పాపను దాటమని రైలు కిందకు పంపించింది. ఇంతలోనే..

  రైలు పట్టాలపై ఓ గూడ్సు బండి ఆగి ఉంది. కాస్త దూరంలో ఉన్న బస్టాండ్ వద్దకు చేరాలంటే ఆ రైలు పట్టాలను దాటాల్సిందే. ఆ గూడ్సు రైలు ఎప్పుడు కదుల్తుందో తెలియదు. అందుకే అందరూ ఆగి ఉన్న ఆ గూడ్సు రైలు కింద నుంచి వంగి వెళ్లడం షరామామూలే. అందరిలాగానే ఆ ముగ్గురు కూడా రైలును దాటి అవతలి వైపునకు వెళ్లాలనుకున్నారు. ముందుగా అమ్మమ్మ రైలు కింద నుంచి వంగి పట్టాలను దాటింది. ఆ తర్వాత ఆరేళ్ల బాలిక పట్టాలను దాటేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు తన అమ్మమ్మ ఉంది. మరో వైపు తన తల్లి ఉంది. అవతలి వైపునకు పంపించేందుకు తల్లి యత్నిస్తోంది. ఇంతలోనే సడన్ గా రైలు కదలింది. క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. కళ్ల ముందే ఆ ఆరేళ్ల బాలిక చనిపోయింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని పేర్నమిట్ట ప్రాంతానికి చెందిన తన్నీరు సుజాతకు కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. సుజాత భర్త హైదరాబాద్ లో కూలి పనులు చేస్తుంటాడు. ఆమె కూడా హైదరాబాద్ లోనే ఉంటూ కూలి పనులకు వెళ్లేది. అయితే అనారోగ్యం కారణంగా పిల్లలతో కలిసి తన తల్లిగారి ఇంటికి వచ్చింది. శనివారం ఒంగోలులోని ప్రభుత్వాసుపత్రికి తన పెద్దకుమార్తె ఆరేళ్ల సుప్రజ, తల్లితో కలిసి వెళ్లింది. వైద్య చికిత్స అనంతరం రైలు ఎక్కి వేటపాలెం రైల్వే స్టేషన్ లో దిగారు. అయితే రైల్వేస్టేషన్ అవతలి వైపు ఉన్న అంబేడ్కర్ కాలనీలోని ఇంటికి వెళ్లేందుకు ఆ రైలు పట్టాలను దాటడం మినహా వేరే మార్గం లేదు.

  ఇది కూడా చదవండి: ఈ రోజు రాత్రి నా భర్త ఒక్కడే ఇంట్లో ఉంటాడు.. వెళ్లి పని పూర్తి చెయ్.. అంటూ భార్యే అతడికి ఫోన్ చేసి మరీ..

  అయితే రైలు పట్టాలపై గూడ్సు రైలు ఆగి ఉంది. దాన్ని దాటే క్రమంలో మొదటగా సుప్రజ అమ్మమ్మ ఆ రైలు కింద నుంచి వంగి అవతలి వైపునకు వెళ్లింది. ఆ తర్వాత ఆరేళ్ల సుప్రజను అవతలి వైపునకు పంపించేందుకు తల్లి ప్రయత్నించింది. ఓ వైపు అమ్మమ్మ, మరో వైపు తల్లి ఉండగా సుప్రజ గూడ్సు రైలు కిందకు వెళ్లింది. ఇంతలోనే సడన్ గా ఆ రైలు కదిలింది. తల్లి, అమ్మమ్మ చూస్తుండగానే సుప్రజ రైలు కింద పడి చనిపోయింది. ప్రయాణికులు కేకలు వేయడంతో గూడ్సు రైలును లోకో పైలట్ ఆపేశాడు. కళ్ల ముందే కుమార్తె మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, ఈ ఘటనపై కుటుంబ సభ్యులు కేసు ఏమీ నమోదు చేయలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఘటన గురించి విచారణ చేస్తున్నామన్నారు.

  ఇది కూడా చదవండి: స్నేహితురాలిని తీసుకుని బైక్‌పై అటవీ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన కుర్రాడికి చేదు అనుభవం.. వాళ్లిద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో..

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Fire Accident, Train accident

  ఉత్తమ కథలు