• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • SIX YEARS OLD CHILD KILLED BY UNKNOWN IN CHITTOOR MS

పెళ్లి వేడుకల్లో చిన్నారి మిస్సింగ్.. గొంతు కోసి హత్య..

ప్రతీకాత్మక చిత్రం

చేనేత నగర్‌లో ఉన్న కల్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన ఓ పెళ్లికి చిన్నారి వర్షిత(6) కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది.

  • Share this:
    చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాలెంలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. చేనేత నగర్‌లో ఉన్న కల్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన ఓ పెళ్లికి చిన్నారి వర్షిత(6) కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు.ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. రాత్రంతా బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభించినట్టు తెలుస్తోంది.చిన్నారిని దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు
    సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: