గుంటూరులో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..

బాధిత చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

news18-telugu
Updated: October 20, 2019, 7:56 PM IST
గుంటూరులో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై  17 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 20, 2019, 7:56 PM IST
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లుపాడులో దారుణం జరిగింది. ఆరేళ్ల ఓ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగాలని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. గ్రామస్తులు
కూడా వారితో పాటు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న గురజాల డిఎస్పీ శ్రీహరిబాబు,సిఐ కోటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన గ్రామస్తులు అక్కడినుంచి వెళ్లిపోయారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు
నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...