హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్.. నిందితుడు పదో తరగతి విద్యార్థే..

అతడో పదో తరగతి విద్యార్థి.. మహా అయితే అతడికి 14 ఏళ్లు ఉంటాయి.. కానీ, పెద్ద నేరమే చేశాడు. ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, తల్లిదండ్రులను రూ. 3 లక్షలు డిమాండ్ చేశాడు.

news18-telugu
Updated: November 18, 2019, 1:06 PM IST
హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్.. నిందితుడు పదో తరగతి విద్యార్థే..
హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్.. నిందితుడు పదో తరగతి విద్యార్థే..
  • Share this:
అతడో పదో తరగతి విద్యార్థి.. మహా అయితే అతడికి 14 ఏళ్లు ఉంటాయి.. కానీ, పెద్ద నేరమే చేశాడు. ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, తల్లిదండ్రులను రూ. 3 లక్షలు డిమాండ్ చేశాడు. అంతేకాదండోయ్.. కరుడుగట్టిన కిడ్నాపర్‌లా ఫోజులు ఇస్తూ నీ కొడుకు నీకు దక్కాలంటే వెంటనే డబ్బు ఇవ్వాలని లేకపోతే దక్కడని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు దంపతులకు అర్జున్(6) కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే.. ఆదివారం మధ్యాహ్నం కాలనీలో ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. కాసేపటికే రాజుకు ఓ అగంతకుడి నుంచి కాల్ వచ్చింది. ‘నీ కొడుకును కిడ్నాప్ చేశాను. నీ కొడుకు నీకు దక్కాలంటే రూ.3లక్షలు ఇవ్వు. ఇప్పటికిప్పుడు రూ.లక్ష కావాలి. కొంత సొమ్ము ‘ఫోన్ పే’ చెయ్యు’ అని కిడ్నాపర్ డిమాండ్ చేశాడు.

కిడ్నాపర్, బాధిత బాలుడు


వెంటనే.. బాధితుడి తండ్రి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా 14 ఏళ్ల బాలుడు కనిపించాడు. దీంతో అతడిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. కిడ్నాప్‌ అయిన బాలుడిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కేవలం 3 గంటల్లోనే పూర్తయ్యింది. హైలైట్ ఏంటంటే.. బాధిత బాలుడి తండ్రికి ఆ కిడ్నాపర్ ఫోన్ మాట్లాడిన తీరే. కిడ్నాపర్‌లా ఫోజ్ ఇస్తూ మాట్లాడిన తీరు చూస్తుంటే సినిమాలకు బాగానే ప్రభావితం అయినట్లు అగుపిస్తోంది.


Published by: Shravan Kumar Bommakanti
First published: November 18, 2019, 11:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading