SIX YEARS OF LOVE AND THEN MARRIAGE BUT WIFE TAKEN THESE DECISION RUINS HER MARRIED LIFE SSR
Wife: భర్తతో ఇంత ప్రేమగా ఉన్నావు కదా.. ఇలా ఎందుకు చేయాలనిపించింది.. కలికాలం..
సంతోష్, శ్రుతి (ఫైల్ ఫొటో)
కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ తాలూకా మదిక్కెరె గ్రామానికి సమీపంలో సంతోష్ అనే 29 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. రోజూలానే డ్యూటీకి వెళ్లి బైక్‌పై వెళ్లి తిరిగొస్తున్న సంతోష్‌ను ఎవరో దారుణంగా హత్య చేసి పడేశారు.
హసన్: కొందరు భార్యాభర్తలుంటారు. ఒకరిపై ఒకరు ప్రేమతో ఉన్నట్టుగానే కనిపిస్తారు. కానీ.. మనసులో మరొకరిని ప్రేమిస్తూ తనువు, మనసు వారితో పంచుకుంటూ పవిత్రమైన వివాహ బంధానికే మచ్చ తెస్తుంటారు. అలాంటి వారినే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తులుగా సమాజం చెప్పుకుంటూ ఉంటుంది. ఈ ఫొటోలో చూస్తున్న జంటది కూడా అదే కథ. పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి వేరొకరితో పెళ్లి తర్వాత కూడా భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఆ వ్యక్తితో సంబంధం కొనసాగించే వారు కొందరైతే.. పెళ్లి తర్వాత పర స్త్రీ లేదా పర పురుషుడి వ్యామోహంలో పడి పండంటి కాపురాన్ని చీకటిమయం చేసుకుంటున్న వారు కొందరు ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి భార్యే శ్రుతి. ఈ ఘటన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రియుడి మోజులో భర్తను చంపేసిన ఓ భార్య కథ. రోజూ ఏదో ఒక చోట వెలుగుచూస్తున్న అంతులేని కథ.
కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ తాలూకా మదిక్కెరె గ్రామానికి సమీపంలో సంతోష్ అనే 29 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. రోజూలానే డ్యూటీకి వెళ్లి బైక్‌పై వెళ్లి తిరిగొస్తున్న సంతోష్‌ను ఎవరో దారుణంగా హత్య చేసి పడేశారు. అయితే.. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతని భార్య చేసిన ప్రయత్నం విఫలమైంది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కొడగు జిల్లా సోమవపేటె తాలూకాకు చెందిన సంతోష్ అనే యువకుడు శ్రుతి అనే యువతిని ప్రేమించాడు.
ఆమె కూడా అతనిని ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఆరేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి ప్రేమ పెళ్లి బంధానికి శ్రుతి పక్కచూపు బీటలు వారేలా చేసింది. భర్తకు తెలియకుండా చంద్రశేఖర్ అనే యువకుడితో శ్రుతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో బాగా దగ్గరయిన శ్రుతి భర్తను నిర్లక్ష్యం చేసింది. రోజూ డ్యూటీకి వెళ్లి భార్య గురించే.. ఆమెతో తన భవిష్యత్ గురించే ఆలోచిస్తున్న సంతోష్‌కు శ్రుతి నమ్మకద్రోహం చేసింది. ఈ విషయం తెలియని సంతోష్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ.. భర్త ప్రేమ రుచించని శ్రుతి చంద్రశేఖర్‌పై తన ప్రేమను చూపించింది.
ఇలా తన భర్తకు తెలియకుండా చంద్రశేఖర్‌తో కలిసి ఉండటం ఎల్లకాలం సాగదని భావించిన శ్రుతి చివరకు భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆరేళ్ల ప్రేమ పెళ్లికి ఆ ఆలోచన సమాధి కట్టింది. తన భర్తను చంపేయాలన్న నిర్ణయాన్ని ప్రియుడితో పంచుకుంది. అతను కూడా అందుకు సరేననడంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. అందుకు ప్రియుడి స్నేహితుడు కూడా సహకారం తీసుకుంది. ప్లాన్ ప్రకారం డ్యూటీకి వెళ్లి వస్తుండగా సంతోష్‌ను హత్య చేశారు. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు శ్రుతి శాయశక్తులా ప్రయత్నించింది. పోలీసులకు ఆమె వైఖరిపై అనుమానం రావడం, హత్య చేసి చంపినట్లు మృతదేహాన్ని పరిశీలించగా స్పష్టం కావడంతో శ్రుతిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంతోష్‌ను చంపడానికి మనసెలా వచ్చిందోనని, ఆమెను కఠినంగా శిక్షించాలని సంతోష్ కుటుంబం డిమాండ్ చేసింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.