Home /News /crime /

దారుణం.. వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరేండ్ల బాలిక..

దారుణం.. వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరేండ్ల బాలిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

    హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల బాలికపై దాడి చేయడంతో మృతి చెందింది. హైదరాబాద్‌లోని బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలోని సుశీల టౌన్‌షిప్‌లో ఉండే అంగోత్ హోలి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అయితే శనివారం మధ్యాహ్నా సమయంలో కూతురు అమూల్య ఇంటి ఎదుట ఆడుకుంటోంది. ఈ సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Hyderabad, Stray dogs attack, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు