శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. బీచ్‌లో ఆరుగురు యువకులు గల్లంతు..

గార మండలం కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.

news18-telugu
Updated: November 10, 2019, 9:04 PM IST
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. బీచ్‌లో ఆరుగురు యువకులు గల్లంతు..
ప్రాణాలతో బయటపడిన విద్యార్థి
news18-telugu
Updated: November 10, 2019, 9:04 PM IST
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గార మండలం కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరి శవం బయటకు కొట్టుకొచ్చింది. మరో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పిక్‌నిక్ కోసం బీచ్‌కు వెళ్లారు. వారిలో స్నానానికి దిగి.. లింగాల రాజ సింహం, షేక్ అబ్దుల్లా,ప్రవీణ్ కుమార్ రెడ్డి, యజ్ఞమయ పండా, కురుమూరి సందీప్, అనపర్తి సుందర్ గల్లంతయ్యారు. రాజసింహ ప్రాణాలతో బయటపడ్డాడు. మరొకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...