సెక్స్ కోసం పబ్లిక్ పార్కుకు వెళ్లిన వృద్ధులు.. నిఘా పెట్టిన పోలీసులకు షాక్..

ఓ పార్కు సెక్స్ ప్రియులకు ఫేమస్ అని తెలిసి అక్కడకు వెళ్లారు. ప్రదేశం బాగుందిలే అనుకుంటూ తమ కోరికలను తీర్చుకునే పనిలో మునిగిపోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

news18-telugu
Updated: August 22, 2019, 1:10 PM IST
సెక్స్ కోసం పబ్లిక్ పార్కుకు వెళ్లిన వృద్ధులు.. నిఘా పెట్టిన పోలీసులకు షాక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారంతా ఆరు పదుల వయసు దాటినవాళ్లే.. కృష్ణా.. రామా.. అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన వాళ్లలో సెక్స్ కోరికలు రంకెలేశాయి. ఇంకేముంది అంతా కలిసి శృంగారం కోసం పబ్లిక్ పార్కుల వెంట పడ్డారు. ఎవరైనా దొరక్కపోరా.. అనుకుంటూ వెతుకులాట ప్రారంభించారు. అంతలో వాళ్లకు ఓ పార్కు సెక్స్ ప్రియులకు ఫేమస్ అని తెలిసి అక్కడకు వెళ్లారు. ప్రదేశం బాగుందిలే అనుకుంటూ తమ కోరికలను తీర్చుకునే పనిలో మునిగిపోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మొత్తం ఆరుగురు వృద్ధులు అరెస్టు కాగా, అందులో ఒకరు మహిళ. ఆమె వయసెంతో తెలుసా.. 85 ఏళ్లు. ఆ వయసులో ఉండి కూడా ఆమె శృంగారం కోసం ఓ పబ్లిక్‌ పార్కుకు రావడం గమనార్హం. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న ఫేర్‌ఫీల్డ్‌లో చోటుచేసుకుంది.

వాస్తవానికి ఎప్పటి నుంచో ఆ పబ్లిక్ పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి ఆ పార్కుపై నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఈ విషయం తెలియని ఆ వృద్ధులు ఆ పార్కుకు వెళ్లి తమ పనిలో నిమగ్నమయ్యారు. సీసీటీవీ లైవ్ చూసిన పోలీసులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. సెక్స్ కార్యకలాపాల్లో మునిగింది వృద్ధులని తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే తేరుకుని ఘటనా స్థలికి వెళ్లి వాళ్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>