Home /News /crime /

అయ్యో పాపం.. కరెంట్ షాక్ కొట్టి.. ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. ఒకరిని కాపాడేందుకు వెళ్లి..

అయ్యో పాపం.. కరెంట్ షాక్ కొట్టి.. ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. ఒకరిని కాపాడేందుకు వెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. వారిని స్థానికులను గమనించి ఆస్పత్రులకు తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    కరెంట్ షాక్ తగిలి ఒకే కుటుంబంలో ఆరుగురు మణించారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లి అందరూ మృత్యువాతపడ్డారు. ఒకరి కోసం మరొకరు వెళ్లి వరుసగా ఆరుగురు మరణించారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. ఛతార్ పూర్ జిల్లాలోని మహాజ్వాల గ్రామానికి చెందిన ఓ ఫ్యామిలీ..తమ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టింది. దాని పైకప్పు స్లాబ్ వేశారు. ఐతే అందుకోసం ఉపయోగించిన ఐరన్ ప్లేట్స్‌ను తొలగించేందుకు ఇంట్లో ఉన్న ఒకరు ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంక్‌లో అప్పటికే లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఐతే విద్యుత్ వైర్లు తేలుకొని ఉండడంతో అందులోని కరెంట్ ఐరన్ పలకలపైకి వ్యాపించింది. అలా అతనికి కరెంట్ షాక్ తగిలింది. అతడి పరిస్థితిని చూసి ఇంట్లో ఉన్న మరో వ్యక్తి కాపాడేందుకు వెళ్లాడు. అతడికి కూడా షాక్ కొట్టింది. వారిని కాపాడేందుకు ఇంకొకరు వెళ్లారు. అలా ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. వారిని స్థానికులను గమనించి ఆస్పత్రులకు తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు