Home /News /crime /

Very Sad: అయ్యయ్యో.. భగవంతుడా.. ఎంత ఘోరం జరిగింది.. గాల్లో కలిసిన ఏడు నిండు ప్రాణాలు..

Very Sad: అయ్యయ్యో.. భగవంతుడా.. ఎంత ఘోరం జరిగింది.. గాల్లో కలిసిన ఏడు నిండు ప్రాణాలు..

లక్ష్మీ, పూజ

లక్ష్మీ, పూజ

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా బాగా నానిపోయి దెబ్బతిన్న మట్టి గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు పొరుగింటికి చెందిన ఓ పాప దుర్మరణం పాలయ్యారు.

    బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా బాగా నానిపోయి దెబ్బతిన్న మట్టి గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు పొరుగింటికి చెందిన ఓ పాప దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బెళగావి జిల్లా హీరేబాగేవాడి తాలూకాలోని బడాల అంకలగి అనే గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. దాదాపు మూడు రోజులుగా గ్రామంలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కూడా కుండపోతగా వాన కురిసింది.

    మట్టి గోడలు కావడం, ఇల్లు కట్టి కూడా కొన్నేళ్లు కావడంతో ఒక్కసారిగా ఉన్నట్టుండి గోడ కూలింది. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్నారు. ఎదురింట్లో ఉండే ఎనిమిదేళ్ల పాప కూడా ఆ సమయంలో వాళ్లింట్లోనే ఉంది. ఉన్నట్టుండి గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో శిధిలాల కింద చిక్కుకుని స్పాట్‌లోనే ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక, విపత్తు నివారణ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని బాధితులను శిధిలాల కింద నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో లక్ష్మీ, అరుణ్, శాంతవ్వ (50), అరుణ్ హనమంత, సత్యవ్వ, పూజ (8), సవిత (28) ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక్క పాప మినహా మిగతా వాళ్లంతా సురేష్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. సురేష్ కుటుంబం ఆ పాత ఇంటిని త్వరలో ఖాళీ చేసి కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరగడం శోచనీయం. సురేష్, అతని మరో కొడుకు కలిసి షాపుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో.. ఈ కుటుంబంలో ఈ ఇద్దరి ప్రాణాలు దక్కాయి.

    ఇది కూడా చదవండి: Sad: దొంగ అనుకుని ఆ యువకుడిని కట్టేసి కొట్టారు.. తీరా అసలు నిజం తెలిసి ఏం చేశారంటే..

    ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సీఎం బసవరాజ్ బొమ్మై సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సురేష్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. బెళగావి ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్, జిల్లా కలెక్టర్ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. సురేష్‌కు ధైర్యం చెప్పి.. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bangalore, Crime news, Heavy Rains, Karnataka, Latest news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు