Bolero vehicle fell Into ditch : ఉత్తరాఖండ్(Uttarakhand) లోని తెహ్రీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చంబా నుంచి ఉత్తరకాశీ వైపు వెళ్తోన్న బొలెరో వాహనం. గంగోత్రి జాతీయ రహదారిపై . కోటి గడ్డ సమీపంలో అదుపు తప్పి హైవే పక్కన ఉన్న వాగులో పడింది. వాహనం కాలువలో పడిన వెంటనే మంటలు చెలరేగాయి. వాహనం కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలోని మంటలను నీళ్లు పోసి ఆర్పివేశారు. అయితే అప్పటికే కారులోని ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ఈ విషయమై తహసీల్దార్ కిషన్ సింగ్ మహంత్ మాట్లాడుతూ వాహనంలో ఆరుగురు ఉన్నారని తెలిపారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మంటల్లో మూడు మృతదేహాలు వాహనం లోపల ఉండగా, మూడు మృతదేహాలు వాహనం బయట పడి ఉన్నాయని చెప్పారు. వాహనంలో ఉన్న వారందరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని చెప్పారు. వీరందరూ ఉత్తరకాశీలోని ఏదో ఒక కొండపై ట్రెక్కింగ్ కోసం ఉత్తరకాశీ వెళ్తున్నారని... ఈ ఉదయం ఈ యువకులు రెండు వాహనాల్లో రైవాలా నుంచి ఉత్తరకాశీకి బయలుదేరారని చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ALSO READ Viral Video : భర్తను క్రికెట్ బ్యాట్ తో చితక్కొట్టిన భార్య..గృహ హింస కేసు పెట్టిన భర్త
మరోవైపు, ధారాసు యమునోత్రి జాతీయ రహదారిపై కల్యాణి సమీపంలో, సోమవారం అర్థరాత్రి రోడ్డు నుండి 200 మీటర్ల లోతైన లోయలో కారు పడిపోయింది, ఇందులో డ్రైవర్ జస్వంత్ సింగ్ చౌహాన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ALSO READ Leopard burnt alive : బోనులో చిక్కిన చిరుత..పెట్రోల్ పోసి తగులబెట్టిన గ్రామస్తు లు
గోల్ బనాల్ తహసీల్ బార్కోట్ గ్రామానికి చెందిన జస్వంత్ చౌహాన్ బర్కోట్ నుండి ఉత్తరకాశీకి అర్థరాత్రి వస్తున్నాడని ధరసు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కారు అదుపు తప్పి కళ్యాణి సమీపంలోని లోతైన లోయలో పడింది. మంగళవారం ఉదయం కల్యాణి సమీపంలోని కాలువలో కారు పడిపోవడాన్ని గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బ్రహ్మాఖల్ నుండి పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Car accident, Six killed, Uttarakhand