నిజామాబాద్‌లో వివాహిత ఆత్మహత్య... ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి

భీమ్‌గల్ పట్టణం బాపూజీ నగర్ కాలనిలో మాలవత్ సువర్ణ (19) అనే వివాహిత ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

news18-telugu
Updated: May 14, 2020, 10:25 PM IST
నిజామాబాద్‌లో వివాహిత ఆత్మహత్య... ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భీమ్‌గల్ పట్టణం బాపూజీ నగర్ కాలనిలో మాలవత్ సువర్ణ (19) అనే వివాహిత ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఆరు నెలల క్రితం సంతోష్ నగర్ తాండకు చెందిన పాల్త్యా శివరాంతో ప్రేమ వివాహం చేసుకుంది. శివరాంకు ముందుగానే వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో మొదటి భార్య విడాకులు తీసుకుంది. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. శివరాం, సువర్ణ ప్రేమ వివాహం చేసుకుని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఐదు నెలలు కాపురం సాఫీగానే సాగింది. ఈ రోజు ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. శివరామే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతురాలి బంధువులు ఆరోపిస్తు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. స్థానికుల సమాచారంతో భీమ్‌గల్ సీఐ సైదయ్య, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింప జేశారు. మృతదేహం ఉన్న గది తలుపులను బద్దలు కొట్టి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని సీఐ సైదయ్య తెలిపారు.
First published: May 14, 2020, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading