పసిపిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన సంచలనం రేపుతున్నది. దేశరాజధాని ఢిల్లీలో ఆరు నెలల పసికందుపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. (six Month Old girl raped in Delhi) చిన్నారితోపాటు మతిస్థిమితం లేని ఆమె 14ఏళ్ల అక్కపైనా మరో నిందితుడు దారుణానికి ఒడిగట్టారు. వాయువ్య ఢిల్లీలోని సమయ్‌పూర్‌బద్లీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు.. అందులో ఒకడిని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, బాధిత కుటుంబం వెల్లడించిన వివరాలివి.. (Teenager and 6 Month Old Baby Sister raped In Delhi)
ఢిల్లీ సమయ్‌పూర్‌బద్లీ ప్రాంతంలో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తోంది. 14 ఏళ్ల పెద్దమ్మాయి బుద్దిమాంద్యంతో బాధపడుతోంది. రెండో పాప ఆరు నెలల కిందటే పుట్టింది. పని చేస్తే తప్ప పిల్లలను పోషించుకోలేని దీన స్థితిలో ఆ తల్లి.. ఇద్దరు బిడ్డలనూ ఇంట్లోనే ఉంచి రోజూ పనికి వెళ్లేది. శుక్రవారం సాయంత్రం తల్లి ఇంటికి తిరిగొచ్చే సరికి పిల్లలు కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ తల్లి చుట్టుపక్కల వెతుకులాట మొదలుపెట్టింది. పొరుగింట్లో నుంచి పిలల ఏడుపు వినిపించడంతో అనుమానంగా అక్కడికి వెళ్లి బలంగా తలుపులు తోసింది. తన ఇద్దరు కూతుళ్లపై ఇద్దరు మృగాళ్లు పైశాచికానికి పాల్పడుతోన్న దృశ్యం చూసి షాకైందా తల్లి.
పిల్లల తల్లిని చూడగానే ఇద్దరు కీచకులు ఆమెను పక్కకు తోసేసి పరారయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్ తో సహా వచ్చి పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల పసికందుతోపాటు బుద్ది మాంద్యంతో బాధపడుతోన్న 14 ఏళ్ల పెద్దపాపపైనా అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
పిల్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కమల్ మల్హోత్రా, రాజుగా పోలీసులు గుర్తించారు. పసిపాపను రేప్ చేసింది 40 ఏళ్ల కమల్ మల్హోత్రాగా నిర్ధారించారు. కూలీ పనులు చేసుకునే వీళ్లిద్దరూ కొంతకాలంగా పనిలేక ఖాళీగా ఉంటున్నారు. పక్కింట్లో పరిస్థితిని అనుకూలంగా భావించి పిల్లలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత ఇద్దరు నిందితులు పరారయ్యారు.
కాగా, ఏ1 కమల్ మల్హోత్రా శనివారం నాడు ఓ పార్కులో కనిపించడంతో పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అప్పటికే దేశీ తుపాకి కలిగిఉన్న కమల్.. పోలీసులపై కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పుల్లో వాడి తొడకు బుల్లెట్ దిగింది. పావుగంట హైడ్రామా తర్వాత ఎట్టకేలకు వాణ్ని పోలీసులు అరెస్టు చేశారు. రెండో నిందితుడు రాజు కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child rape, Delhi, Delhi police, Rape case