Rape Case: బాలికపై ఆరుగురు అత్యాచారం.. వేర్వేరు ఘటనల్లో...

ప్రతీకాత్మక చిత్రం

Rape Case: ఎప్పుడైనా సరే ఒంటరిగా యువతి లేదా బాలిక ఎవరైనా సరే... వెళ్తూ ఉంటే... ఆ పరిస్థితి క్యాష్ చేసుకోవాలని చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగింది?

 • Share this:
  Rape Case: మన దేశంలో క్రూరత్వం ఎంతలా పెరిగిపోయిందో చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి గ్యాంగ్ రేప్ జరిగిన బాలికపై... కొన్ని గంటల్లోనే మరోసారి మరోచోట గ్యాంప్ రేప్ జరిగింది. అంటే మన దేశంలో రేప్ చేస్తే శిక్షలు పడతాయనే భయమే లేకుండా పోతోంది. అసలేమైందంటే... మహారాష్ట్ర... నాగపూర్‌లోని ఓ ఇంట్లో ఏదో గొడవ జరిగి... ఓ టీనేజీ అమ్మాయి... ఆవేశంలో ఇల్లు వదిలి బయటకు వెళ్లింది. కానీ బయటి ప్రపంచం ఎంత ప్రమాదకరమో ఆమె గుర్తించలేకపోయింది. గురువారం రాత్రి నలుగురు ఆటో డ్రైవర్లు... ఆ బాలికను తింకీ ఏరియాలో ఎత్తుకుపోయి.. ఓ గదిలో గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత తలో దిక్కుకూ పారిపోయారు.

  ఆ బాలికకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. గంట కిందట తాను ఎలా ఉన్నదీ... ఇప్పుడు ఎలా ఉన్నదీ ఊహించుకుని తీవ్రంగా షాకైంది. తనకు ఇలా జరిగిందేంటని చాలా కుమిలిపోతూ... ఇంటికి వెళ్లాలో... ఎక్కడికి వెళ్లాలో తెలియక... అలా వెళ్తూ ఉంటే... మాయో హాస్పిటల్ స్వ్కేర్ దగ్గర మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఇంత దారుణమా? ఇండియానేనా ఇది?

  ఎస్సీ వర్గానికి చెందిన ఆ బాలిక... వదినతో గొడవ పడి ఇంట్లోంచీ వెళ్లిపోయింది. ఆమె ఫ్రెండ్స్‌లో ఒకరు ఆమెను లోహాపూల్ ఏరియాలో ఆటోలో తెచ్చి వదిలారు. అక్కడ ఆ బాలిక 25 ఏళ్ల ఆటోడ్రైవర్ షానవాజ్‌ని కలిసింది. తాను ఇంట్లోంచీ పారిపోయి వచ్చాననీ... తనకు డబ్బు ఇచ్చి... ఇంట్లో ఉండేందుకు వీలు కల్పించమని కోరింది. ఆమెకు సాయం చేస్తానని ఆటో ఎక్కించుకున్న షానవాజ్... దారిలో ఓ మద్యం షాపులో మద్యం బాటిళ్లు కొన్నాడు. తను మద్యం తాగి... ఆమెకు కూడా బలవంతంగా తాగించాడు.

  ఇది కూడా చదవండి: జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన భర్త.. ఇంటికి వెళ్లి భార్యను ఏం చేశాడంటే..

  అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు అద్దెకు ఉంటున్న గదికి తీసుకెళ్లాడు. ఆ ఇద్దరూ నాగపూర్ రైల్వే స్టేషన్‌లో లగేజీ ఎత్తేవారు. ఆ సమయంలో 26 ఏళ్ల షానవాజ్ ఫ్రెండ్ మహ్మద్ తౌసిఫ్ మహ్మద్ యుసఫ్ కూడా అక్కడికి వచ్చాడు. ఆ గదిలోనే నలుగురూ అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను షానవాజ్... మాయో ఆస్పత్రి స్క్వేర్ దగ్గర వదిలేసి పోయాడు.

  ఆమెను అలా వదిలేయడం ఇద్దరు ఆటో డ్రైవర్లు చూశారు. వాళ్లలో వాళ్లు ఏదో మాట్లాడుకొని బాలిక దగ్గరకు వచ్చారు. ఒక్కసారిగా నోరు మూసి... ఆటోలో ఎక్కించుకొని పట్టుకుపోయారు. మరోసారి గ్యాంగ్ రేప్ చేశారు.

  ఇది కూడా చదవండి: ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రేప్... HR మేనేజర్ ఉచ్చులో చిక్కిన యువతి

  ఆ తర్వాత ఆమెను రోడ్డుపై వదిలి పారిపోయారు. ఆ సమయంలో... ఇద్దరు వ్యక్తులు ఆమెను చూశారు. ఏం జరిగిందని అడిగారు. జరిగింది చెప్పింది. షాక్ అయ్యారు. తాను రైలు ఎక్కి నాశిక్ వెళ్లేందకు డబ్బు కావాలని బాలిక వాళ్లను అడిగింది. వాళ్లు ఆమెకు డబ్బు ఇచ్చారు. నాగపూర్ రైల్వే స్టేషన్‌కి వెళ్లిన బాలిక... అక్కడ ట్రైన్ టికెట్ కొనుక్కొని ప్లాట్ ఫామ్ 1పై రైలు కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో పెట్రోలింగ్ టీమ్ ఆమెను చూసి... గవర్నమెంట్ రైల్వే పోలీసుల (GRP)కు చెప్పారు. ఆ బాలికను చూస్తే ఏదో తేడాగా ఉంది అనిపించిన వాళ్లు... ఆమెను విషయం అడిగి... చైల్డ్ కేర్ సెంటర్‌కి అప్పగించారు. వాళ్లు బాలికతో కేసు పెట్టించారు.

  GRP టీమ్... ఆదివారం షానవాజ్‌, యూసఫ్, మహ్మద్ ముషీర్ (23)ని అరెస్టు చేసింది. వీరంతా... మోమిన్ పురా ఏరియాలో ఉంటున్నారు. వీళ్లను సితాబుల్దీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
  Published by:Krishna Kumar N
  First published: