news18-telugu
Updated: November 21, 2020, 6:55 AM IST
యువతిపై గ్యాంగ్ రేప్... కారులో తీసుకెళ్లి అమానుషం
Gang Rape in Amritsar: ఆమె వయస్సు 25 సంవత్సరాలు. పంజాబ్... అమృత్‌సర్‌లోని ఫాజిల్కా ప్రాంతానికి చెందిన యువతి. గురుద్వారా సాహిబ్‌లో ప్రార్థనలు చేసుకుందామని సాయంత్రం వేళ వచ్చింది. అంతలో... ఎవరో ఆమె పర్స్ కొట్టేశారు. ఓవైపు చీకటి పడుతుంటే... డబ్బుల కోసం వాళ్లనూ వీళ్లనూ అడగసాగింది. ఆ దృశ్యాన్ని కొద్ది దూరంలో ఉన్న కారు లోంచీ యుగ్రాజ్ సింగ్ చూశాడు. కారులో అతనితోపాటూ... మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్లిద్దరూ... ఆమె వైపు చూసి... తలలు ఊపుకున్నారు. ఆ తర్వాత... కారు ఆమె ముందుకొచ్చి ఆగింది. హలో... ఎక్కడికి వెళ్లాలండి... అని అడిగారు. ఆమె తన దగ్గర డబ్బులు లేవనీ... పర్స్ ఎవరో కొట్టేశారని చెప్పింది. సరే ఎక్కడికి వెళ్లాలి మీరు... అని అడిగితే... ఫాజిల్కా వెళ్లాలని చెప్పింది. "అవునా... మరి మేం అటే వెళ్తున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే... వెనక కూర్చోండి" అన్నాడు యుగ్రాజ్ సింగ్. మొహమాట పడుతూనే... వేరే దారి లేదనుకున్న ఆమె.. కారు ఎక్కింది.
అంతా చీకటి... కాసేపటి తర్వాత... కారు రూట్ మారింది. వెంటనే ఆమె... "అదేంటి... ఫాజిల్కా అటువైపు కదా" అంది. "అటే గానీ... అటు రోడ్డు బాలేదు. ఇది అడ్డరూటు... త్వరగా వెళ్లొచ్చు" అంటూ కారు స్పీడ్ పెంచాడు యుగ్రాజ్. ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఏదో జరుగుతోందనే అనుమానం కలిగింది. కారు లోంచీ దూకేద్దామంటే... చాలా వేగంగా వెళ్తోంది. డోర్లన్నీ లాక్ అయి ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో కారు ఓ తుప్పల్లోని ఇంటి దగ్గర ఆగింది. ఆ చుట్టుపక్కల మరే ఇళ్లూ లేవు. అంతా చీకటిగా ఉంది.
కారు ఆగగానే... మరో నలుగురు ఆ ఇంట్లోంచీ బయటకు వచ్చారు. అందరూ పొలోమంటూ వచ్చి... కారు చుట్టూ మూగారు. కారులో వాళ్లు కత్తి చూపించి... ఆమెను బయపెట్టి... కారు లోంచీ బయటకు తెచ్చారు. మెడపై కత్తి పెట్టి... ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లారు. అక్కడ అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. రాత్రంతా ఆమెకు నరకం చూపించారు. తెల్లారి ఓ గుర్తు తెలియని ప్రాంతంలో ఆమెను వదిలేసి... ఈ విషయం ఎవరికైనా చెబితే... నిన్నూ, నీ తల్లిదండ్రులను కూడా చంపుతాం అని బెదిరించి... పారిపోయారు.
ఇది కూడా చదవండి: గోవా వెళ్తున్నారా... ప్రాణాలకే ప్రమాదం... రెండ్రోజుల్లో 90 మంది ఆస్పత్రిపాలు
ఆ అభాగ్యురాలు... స్థానికుల ద్వారా అడ్రెస్ తెలుసుకొని... అక్కడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఈ కేసులో యుగ్రాజ్ సింగ్ సహా ముగ్గుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు.
బాధితురాలు లూథియానాలో జాబ్ చేస్తోందనీ... షహీద్ సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు చేసేందుకు వచ్చినప్పుడు ఈ దారుణం జరిగిందని... ఏసీపీ హర్పాల్ సింగ్ తెలిపారు. అత్తారీ గ్రామంలో ఆమెను గ్యాంగ్ రేప్ చేశారని వివరించారు. నిందితులందరిపైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Published by:
Krishna Kumar N
First published:
November 21, 2020, 6:55 AM IST