Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టింది. ఝాగ్దే నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోరిక్షాను కంటైనర్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముంబైకి 240 కిలోమీటర్ల దూరంలోని కోపర్గావ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసూద్పుర్ ఫాటా సమీపంలో 8 గంటలకు ఈ ఘటన జరిగింది.
ఝాగ్దే నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోరిక్షాను.. కంటైనర్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మృతులలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను ట్రీట్మెంట్ నిమిత్తం కోపర్గావ్ రూరల్ హాస్పిటల్ కి తరలించారు.
ALSO READ Shocking : బామ్మను సాకలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన మనవరాళ్లు
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మురాదాబాద్ జిల్లా వాసులు రాంపుర్లోని ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని, అనంతరం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. వాహనంలో మొత్తం 11 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. నలుగురు తీవ్రగాయాల పాలుకాగా, ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Maharashtra, Road accidents, Uttar pradesh