కలెక్టరేట్‌లోనే పోర్న్ వీడియోల వీక్షణం.. అధికారులకు దిమ్మదిరిగే షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగులు హాట్‌స్టార్, యూట్యూబ్, పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది. కొందరు అధికారులైతే ఏకంగా పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

  • Share this:
    అది జిల్లా కలెక్టర్ ఉండే కార్యాలయం.. నిత్యం ఉన్నతాధికారులతో, ప్రజాప్రతినిధులతో రద్దీగా ఉండే సమయం.. ప్రజల సమస్యలు తీర్చే పవిత్ర స్థలం.. కానీ, అది కొందరు ఉద్యోగులకు హాలీడే ప్లేస్. ఇంకా చెప్పాలంటే సినిమా హాల్.. ఇంకా ఇంకా చెప్పాలంటే.. పోర్న్ సినిమాలు చూసేందుకు వాడే చోటు. ఇదీ.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కలెక్టరేట్ కార్యాలయం. ఆఫీసు పని వేళ్లలో కలెక్టరేట్ ఉద్యోగులు ఇంటర్నెట్‌లో ఎక్కువగా గడుపుతున్నారని ఆ జిల్లా కలెక్టర్‌ అనురాగ్ చౌదరికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన.. ఉద్యోగుల కంప్యూటర్లపై నిఘా పెట్టాలని సైబర్ టీమ్‌ను ఆదేశించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులు హాట్‌స్టార్, యూట్యూబ్, పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది. కొందరు అధికారులైతే ఏకంగా పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

    దీంతో ఆ కలెక్టర్ కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌లు సేకరించి, ఆరుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. ఆఫీసు పనివేళల్లో పనిచేయకపోవడమే కాకుండా, అసభ్యకర వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయడం లాంటి ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా, మిగతా ఉద్యోగులు ఎవ్వరూ కంప్యూటర్లు వాడొద్దని, పనికి సంబంధించిన వెబ్‌సైట్లు తప్ప మిగతా ఏ వెబ్‌సైట్లు పనిచేయకుండా, బ్లాక్ చేయాలని సైబర్ టీమ్‌ను ఆదేశించారు.
    First published: