అపార్ట్‌మెంట్లో ఆరుగురి మృతదేహాలు.. అసలేం జరిగింది?

అన్నదమ్ములిద్దరూ ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పిల్లలకు తినిపించి.. ఆ తర్వాత ఉరివేసి చంపారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనంతరం వారిద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.

news18-telugu
Updated: June 19, 2020, 7:02 PM IST
అపార్ట్‌మెంట్లో ఆరుగురి మృతదేహాలు.. అసలేం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టూర్‌కి వెళ్తన్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆరుగురు కుటుంబ సభ్యులు.. ఓ అపార్ట్‌మెంట్‌లో శవాలుగా కనిపించారు. ఉరికొయ్యలకు వేలాడుతూ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లొో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్ (40) అన్నాదమ్ముళ్లు. నగరంలోని వేర్వేరు ప్రాంతంలో భార్యా, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఐతే ఈ నెల 17న విహార యాత్రకు వెళ్తున్నామని భార్యలకు చెప్పి.. పిల్లలతో బయటకు వెళ్లారు. భార్యలను తమ వెంట తీసుకెళ్లలేదు. ఐతే జూన్ 18 రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయింది.

వీరికి వాత్వా జీఐడీసీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ ఉంది. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. కుటుంబ సభ్యులకు అనుమానమొచ్చి ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉండడం.. ఎంత పిలిచినా ఎవరూ రాకపోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇంటి లోపల ఆరుగురు మృతదేహాలు ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించాయి. అమ్రిష్, గౌరంగ్ మృతదేహాలు డ్రాయింగ్‌ రూమ్‌లో, ఇద్దరు అమ్మాయిలు కృతి(9), సాన్వి(7) మృతదేహాలు కిచెన్‌లో, మయూర్‌ (12), ధ్రువ్‌ (12) మృతదేహాలను బెడ్‌రూమ్‌లో స్వాధీనం చేసుకున్నారు.

ఐతే అన్నదమ్ములిద్దరూ ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పిల్లలకు తినిపించి.. ఆ తర్వాత ఉరివేసి చంపారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనంతరం వారిద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ఆరుగురి మృతదేహాలను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు చనిపోవడంతో స్థానికంగా విషాధ చాయలు అలుముకున్నాయి. ఐతే అన్నాదమ్మళ్లు ఎందుకు ఇలా చేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది.

First published: June 19, 2020, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading