రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అగ్నికి అహుతైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా,17 మంది గాయపడ్డారు. ఈ ఘోర దుర్ఘటన రాజస్తాన్‌లోని జలోరే జిల్లాలోని మహేష్‌పూర్‌లో చోటుచేసుకుంది. బస్సుకు ఎలక్ట్రిక్ వైర్ తగలడంతో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలోలో డ్రైవర్, కండెక్టర్ ఘటనస్థలంలోనే మృతిచెందారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన మరో నలుగురు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన జరిగిన తర్వాత స్థానిక ప్రజలు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల సహాయంతో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఇక, బస్సులో ఉన్నవారు జైన యాత్రికులుగా సమాచారం.
జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలో శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసకుందని జలోరే అదనపు జిల్లా కలెక్టర్ చగాన్ లాల్ గోయల్ తెలిపారు. గాయపడిన 17 మందిలో 7గురిని జోద్పూర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
అయితే చాలా మంది తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:January 17, 2021, 06:21 IST