HOME »NEWS »CRIME »six dead and 14 injured in nalgonda district road accident ba

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, 14 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, 14 మందికి గాయాలు
ప్రతీకాత్మక చిత్రం

నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఆటోలో ఉన్నవారు ఉన్నట్టుగానే చనిపోయారు. వారి మృతదేహాలను బయటకు తీశారు.

  • Share this:
    నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఆటోలో ఉన్నవారు ఉన్నట్టుగానే చనిపోయారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా చింతబావి గ్రామానికి చెందిన రోజువారీ కూలీలుగా తెలుస్తోంది. వారంతా వరి పొలంలో నాట్లు వేసి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటోను కంటెయినర్ లారీ ఢీకొట్టింది. గాయపడిన వారిలో కొందరిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆటోలోని ఐదుగురు మహిళా కూలీలు, ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోలో 20 మంది ఉన్నట్టు చెబుతున్నారు. మరో 14మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 21, 2021, 19:16 IST