హోమ్ /వార్తలు /క్రైమ్ /

తెలంగాణలో మరో ఘోరం.. క్రికెట్ ఆడుదాం రమ్మంటూ బాలుడిపై లైంగిక దాడి

తెలంగాణలో మరో ఘోరం.. క్రికెట్ ఆడుదాం రమ్మంటూ బాలుడిపై లైంగిక దాడి

బాలుడిపై లైంగిక దాడి

బాలుడిపై లైంగిక దాడి

క్రికెట్ ఆడుకుందాం రమ్మంటూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆరుగురు అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ కరువైంది. తాజగా ఓ బాలుడిపై కూడా లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా కోదాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడకు చెందిన 13 ఏళ్ల బాలుడిని అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈనెల 18న క్రికెట్ ఆడుకుందాం రమ్మంటూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆరుగురు అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో తనపై ఆరుగురు ఏడునెలలుగా లైంగిక దాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో తల్లి అదే రోజు వెళ్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. నవీన్ అనే మరో యువకుడ్ని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదికూడా చూడండి:

చిన్నారికి చెత్త గిఫ్ట్ ఇచ్చిన తల్లి

First published:

Tags: Nalgonda

ఉత్తమ కథలు