• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SIT ISSUE NOTICE TO KADAPA MP YS AVINASH REDDY IN YS VIVEKA MURDER CASE BA

వైసీపీ ఎంపీకి షాక్... వైఎస్ వివేకా హత్యకేసులో సిట్ నోటీస్...

వైసీపీ ఎంపీకి షాక్... వైఎస్ వివేకా హత్యకేసులో సిట్ నోటీస్...

వైఎస్ వివేకానంద రెడ్డి

వైఎస్ జగన్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి సాక్షిగా హాజరుకానున్నారు.

  • Share this:
    వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారణకు పిలిచిన కోర్టు తర్వాత వైసీపీ ఎంపీకి నోటీసు ఇచ్చింది. వైఎస్ జగన్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి సాక్షిగా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డికి బాబాయి, స్వయానా మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించింది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు గడిచినా కూడా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో సిట్ విచారణ వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీని విచారించింది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: