వంద ఆవుల మృతిపై సిట్ దర్యాప్తు... ఏపీ డీజీపీ ఆదేశం

ఆవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికను విజయవాడ జాయింట్ కమిషనర్ నాగేంద్రకుమార్‌కు అందజేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.

news18-telugu
Updated: August 13, 2019, 12:37 PM IST
వంద ఆవుల మృతిపై సిట్ దర్యాప్తు... ఏపీ డీజీపీ ఆదేశం
గోశాలలో ఆవుల్ని పరీక్షిస్తున్న వైద్యులు
  • Share this:
విజయవాడలో వంద గోవుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. ఏసీపీ ఆధ్వర్యంలో డీజీపీ సిట్‌ను నియమించారు.నిజానిజాలు బయటపెట్టే వరకు సిట్‌ పనిచేస్తుందని ఆయన అన్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో ఎలాగైనా సరే కేసును ఛేదించాలని ఆయన నిర్ణయించారు.పశుసంవర్థకశాఖ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ప్రకాశం జిల్లా నుంచి ఆవులకు గడ్డి అందించేవారిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు.సిట్ టీమ్‌కు సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వం వహించనున్నారు.ఈ టీమ్‌లో సీసీఎస్‌ సీఐ చలపతిరావు, రెండో పట్టణ సీఐ ఉమర్‌, ఎస్సై శేఖర్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై అర్జున్‌, సైబర్‌క్రైం ఎస్సై దీపిక సభ్యులుగా ఉన్నారు. సిట్ ఆవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికను విజయవాడ జాయింట్ కమిషనర్ నాగేంద్రకుమార్‌కు అందజేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.

గతవారం కొత్తూరు తాడేపల్లి గోశాలలో గోవుల మృత్యు ఘోష తోలిసిందే. ఒక్కసారిగా గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరికొన్ని గోవులు అస్వస్థతలకు గురయ్యాయి. అయితే కలుషితి ఆహారం తినే ఆవులు మృతిచెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని ఆవుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. అంతక ముందురోజు రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆవులకు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు విష ప్రయోగం జరగలేదని, అయితే ఆవుల లోపలి శరీర భాగాల్లో రక్తపు చారికలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని పట్టుకునేందుకు ఏపీ డీజీపీ సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు