హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shameful Incident: ఏం మనిషివిరా బాబూ.. తల్లి చనిపోయి బాధలో ఉన్న ఏ కొడుకూ నీలా చేయడు..

Shameful Incident: ఏం మనిషివిరా బాబూ.. తల్లి చనిపోయి బాధలో ఉన్న ఏ కొడుకూ నీలా చేయడు..

నిందితుడు విజయ్

నిందితుడు విజయ్

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన విజయ్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మంచాన పడి చనిపోయింది.

చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన విజయ్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మంచాన పడి చనిపోయింది. అప్పటి నుంచి విజయ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తల్లినే తల్చుకుంటూ కుమిలిపోయాడు. దీంతో.. అతని సవతి తల్లి విజయ్ పరిస్థితి చూడలేక తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది. కొన్నిరోజుల నుంచి విజయ్ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు.

విజయ్ సవతి తల్లికి 15 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. సొంత చెల్లిలా చూసుకోవాల్సిన ఆ బాలికను విజయ్ తన బైక్ ఎక్కించుకుని స్కూల్ దగ్గర దింపేస్తానని చెప్పాడు. ఆ బాలిక అన్నయ్యే కదా అని ఏమాత్రం వేరే ఆలోచన చేయకుండా బైక్ ఎక్కింది. తల్లి పోయిన బాధలో ఉన్న విజయ్ చెల్లికి ఒక మంచి అన్నగా ఉండాల్సింది పోయి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.

ఇది కూడా చదవండి: Viral: ఇదేదో రికార్డింగ్ డ్యాన్స్‌లో సీన్ కాదు.. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలిస్తే..

‘నువ్వు నా అన్నయ్యవని.. ఇది పాపమని’ ఆ బాలిక చెప్పినా విజయ్‌ వినిపించుకోకుండా ఆ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. ఇంట్లో దింపేసి అక్కడ నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. ఆ బాలిక నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని తల్లి అడిగింది. ఏడుస్తూ ఆ బాలిక జరిగిందంతా చెప్పింది. ఈ విషయం తెలిసి షాకైన ఆమె కూతురుని వెంటబెట్టుకుని హోసూరు మెట్రోపాలిటన్ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

First published:

Tags: Crime news, Sexual harrassment, Tamilnadu

ఉత్తమ కథలు