SISTER KILLED HER BROTHER ALONG WITH LOVER IN NAGPUR VRY
Brother murder : ఇంట్లో ఎవరు లేరని ప్రియుడిని పిలిపించుకుంది.. తమ్ముడు చూశాడని .. దారణం చేసింది.
Brother murder : ఇంట్లో ఎవరు లేరని ప్రియుడిని పిలిపించుకుంది.. తమ్ముడు చూశాడని ..
Brother murder : ఓ యువతి తన ప్రియుడితో ఒంటరిగా ఉన్నప్పుడు తన తమ్ముడు చూశాడని నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. తమ్ముడు అని కూడా చూడకుండా.. విషయం బయటపడుతుందని ప్రియుడితో కలిసి హతమార్చింది.
ప్రస్తుతం సమాజంలో ప్రేమ ( love ) సర్వస్వం అన్నట్టు పిల్లలు వ్యవహరిస్తున్నారు.దీంతో తమ ప్రేమను దక్కించుకునేందుకు అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. తమ జీవితం గమ్యం ఏమిటో తెలియకుండా చివరకు ప్రాణాలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు.. ఈ క్రమంలోనే జీవిత కాలం కలిసి ఉండాల్సిన ప్రేమికులు కటకటలా (jail) పాలు కావడం లేదా ఇతర మార్గల్లో ప్రాణాలు తీసుకోవడం అనే ధోరణిలో పయణిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నాగ్‌పూర్‌కు ( Nagpur ) చెందిన ఓ యువతి ప్రేమాయణం కొనసాగిస్తోంది. అయితే గత సోమవారం ఇంట్లో తల్లిదండ్రులతోపాటు అందరు బయటికి వెళ్లడంతో ఏకంగా తన ప్రియున్ని ఇంటికి పిలిపించుకుంది. ఎవరు రారు అనుకుని ప్రియుడితో ఏకంతంగా గడిపింది. అయితే అప్పుడే అనుకుని షాక్ తగిలింది. తన ప్రియుడితో ఇంట్లో ఉండగానే యువతి సోదరుడు ( brother ) ఇంటికి చేరకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ బండారం బయటపడుతుందని భావించింది.
ఈ క్రమంలోనే తమ్ముడు ఎలాగైనా విషయాలన్ని తల్లిదండ్రులకు చెబుతాడని భావించి.. తమ్ముడినే చంపేస్తే విషయం బయటకు రాకుండా ఉంటుందని క్రూయల్‌గా ఆలోచించింది. తన ప్రియుడితో కలిసి తమ్ముడిని గొంతు పిసికి చంపివేసింది. ( murder) అకారణంగా చనిపోయిన తన కుమారుడి చావుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ( police ) చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ఇలాంటీ సంఘటనే ఒకటి హైదరాబాద్‌లో ( Hyderabad ) చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమ పేరుతో (daughter love ) మరో వ్యక్తితో తిరుగుతుండడంతో తల్లి మందలించింది. దీంతో ఆ కూతురు కన్న తల్లినే కడతేర్చింది. అది కూడ ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.
హైదరాబాద్ చింతల్మెట్లో రెండు రోజుల క్రితమే ఈ దారుణం చోటు చేసుకుంది. చింతల్మెట్లో నివసించే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమార్తె (17) స్థానికంగా ఉండే ఓ బాలుడి(17)తో ప్రేమలో పడింది. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో పలుమార్లు మందలించింది.
అతడితో తిరగొద్దని సోమవారం మధ్యాహ్నం మరోసారి చెప్పింది. అదే సమయంలో అక్కడికి బాలుడిని పిలిపించుకున్న బాలిక తల్లితో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది. తర్వాత తల్లి మెడకు చున్నీ చుట్టి బాలుడి సహాయంతో హత్య (murder ) చేసింది. అనంతరం తన తల్లి కిందపడి చనిపోయిందని చుట్టుపక్కల వారికి తెలిపింది.ఆ సమయంలో ఆమె తండ్రి ఇంట్లో లేరు.ఆయనతో పాటు స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ( police ) బాలుడిని, బాలికను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ( agree ) అంగీకరించారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.