హోమ్ /వార్తలు /క్రైమ్ /

టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లాంటిదే ఈ పోలీస్..డబ్బులిస్తే చాలు అడ్డమైన పనులన్నీ చేస్తది..అడ్డంగా దొరికి అరెస్ట్

టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లాంటిదే ఈ పోలీస్..డబ్బులిస్తే చాలు అడ్డమైన పనులన్నీ చేస్తది..అడ్డంగా దొరికి అరెస్ట్

లేడీ సింగంగా పేరుపొందిన సీమా జాఖర్ కి... రాజ‌కీయ ప్రాబల్యం కూడా చాలా ఎక్కువ‌గా ఉంది. పలువురు స్థానిక నేతలు కూడా ఆమె వివాహానికి హాజరయ్యారు. సీమా జాఖర్ పెళ్లి ఫోటోలు మరియు వీడియోలు చాలా కాలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Seema jakhar arrested : పోలీసులు(Police) అవినీతికి పాల్పడి దొరికిపోయిన సంరద్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ విషయంలో మహిళా పోలీసులు పురుషులతో పోలిస్తే అవినీతికి దూరంగా ఉంటారనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఓ లేడీ పోలీస్(Lady Police) మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. రాజస్తాన్‌(Rajastan)లోని బార్లుట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్‌హెచ్‌ఓ సీమా జఖర్ స్మగ్లర్ల(Smugglers)తో కుమ్మక్కైంది. గతేడాది నవంబర్ లో గుజరాత్‌కు ఆనుకుని ఉన్న సిరోహి జిల్లాలోని బార్లుట్ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన లేడీ సింగంగా పేరుపొందిన సీమా జాఖర్(Seema Jakhar)...స్పాట్‌కు వెళ్లిన తరువాత భిన్నంగా వ్యవహరించింది. దొంగలను పట్టుకోకుండా దొరికిన స్మగ్లర్‌ లతో(Smuggler)రాజీ కుదుర్చుకుంది. స్మగ్లర్లని విడిచిపెట్టేందుకు తో ఏకంగా రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మగ్లర్లు తప్పించుకునేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్న లేడీ పోలీస్ సీమా.. అనంతరం తన వ్యక్తిగత వాహనంలో స్మగ్లర్లు తప్పించుకోవడానికి కూడా సహకరించింది.

డ్రగ్స్ మాఫియా నుంచి లంచం తీసుకున్నట్లు సీమా జఖర్‌పై ఆరోపణలు రావడం,ప్రాధమిక విచారణలో ఆరోపణలు ధృవీకరించబడిన తర్వాత ఉన్నతాధికారులు ఆమెను గతేడాది నవంబర్ లో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ స్మగ్లింగ్ నిందితుల నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని వారిని తప్పించిన కేసులో సీమా జాఖర్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులను కూడా పోలీసు సర్వీసు నుంచి తొలగించారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీమా జాఖర్‌కు పెళ్లయింది. సీమ జ‌క్క‌ర్ రాజ‌కీయ ప్రాబల్యం కూడా చాలా ఎక్కువ‌గా ఉంది. పలువురు స్థానిక నేతలు కూడా ఆమె వివాహానికి హాజరయ్యారు. సీమా జాఖర్ పెళ్లి ఫోటోలు మరియు వీడియోలు చాలా కాలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

OMG : కలియుగ గాంధారి.. 40 ఏళ్లకే 44మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..భయంతో భర్త పరార్

అయితే అవినీతి ఆరోపణలపై పోలీసు సర్వీస్ నుండి తొలగించబడిన సీమా జాఖర్‌ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. సీమా జాఖర్‌ను జోధ్‌పూర్‌లోని ఆమె ఇంటి నుంచి అరెస్టు చేసినట్లు సిరోహి పోలీసు సూపరింటెండెంట్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. సీమా జాఖర్‌ను ఆదివారం అరెస్టు చేసి స్వరూపగంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను విచారిస్తున్నారు. సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, సీమా జాఖర్... బార్లుట్ పోలీస్ స్టేషన్ కంటే ముందు పాలి జిల్లాలోని సందేరావ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారిగా ఉన్నప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకుంది. అప్పుడు కూడా ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

First published:

Tags: Police arrest, Rajastan