• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • SIRCILLA WOMAN FRAUD 15 LAKH RUPEES FROM A YOUNG MAN WHO WAS DOING JOB IN DUBAI FULL DETAILS HERE HSN KNR

Telangana: గొంతులు మార్చే కిలేడీ.. దుబాయిలో ఉన్న కుర్రాడితో ఫోన్లోనే కథ నడిపింది.. భయంతో రూ.15 లక్షలు ఇచ్చినా..

కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

గొంతులు మార్చి మాట్లాడగల ఆమె దుబాయిలో ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడితో పరిచయం పెంచుకుంది. అందమైన అమ్మాయి ఫోటోలను పంపించి అవి తనవేనని నమ్మించింది. ఆ తర్వాత..

  • Share this:
    వంటలు చేసే ఓ మహిళకు దుబాయిలో ఉండే ఓ యువకుడి ఫోన్ నంబర్ లభించింది. మాటలతో అతడిని మాయచేసింది. పేరు మార్చి చాటింగ్ చేస్తూ రూ .15 లక్షలు వసూలు చేసింది. మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శనివారం సాయంత్రం ఆమెను అరెస్టు చేశారు. వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల గంగారెడ్డి ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉంటున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన పుట్ట సునీత శుభకార్యాల్లో వంట పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు దొరికిన పుస్తకంలో గంగారెడ్డి ఫోన్‌నంబర్ లభించింది. ఆ నంబరుతో ఆమె చాటింగ్ ప్రారంభించింది. హైదరాబాద్ కు చెందిన నందుగా గంగారెడ్డితో పరిచయం చేసుకుంది. అందమైన ఓ యువతి ఫొటోలను టిక్ టాక్ లో అప్లోడ్ చేసి తనవేనని పంపించింది.

    మూడు నెలల తర్వాత గొంతుమార్చి తన పేరు వైశు అని, తాను నందు స్నేహితురాలినని పరిచయం చేసుకుంది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తుండగా నందు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిందని నమ్మించింది. ఆమె మొబైల్ ఫోన్లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని, తనకు కొంత డబ్బు ఇస్తే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పనని బెదిరించింది. ఆ తర్వాత తన పేరు సునీత అని మళ్లీ పేరు మార్చుకుని గంగారెడ్డికి ఫోన్ చేసింది. నందు, వైశు ఇద్దరూ మృతిచెందారని, ఇందుకు నీవే కారణమని మరోసారి బెదిరించి గంగారెడ్డిని డబ్బు డిమాండ్ చేసింది. ఇలా గంగారెడ్డికి జగిత్యాలకు చెందిన జిరాక్స్ షాపు నిర్వాహకుడు ఇటిక్యాల రవి బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చింది. అందులో పలుసార్లు డబ్బు వేయాలని సూచించింది.

    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

    డబ్బులు పంపకుంటే ఇద్దరి మృతికి నువ్వే కారణమని చెబుతానని బెదిరించింది. భయానికి గురైన గంగారెడ్డి ఖాతా నంబరుకు డబ్బు పంపించాడు. ఇలా మొత్తం రూ .15 లక్షల వరకు పంపించాడు. దుబాయి నుంచి వచ్చిన గంగారెడ్డి ఈ విషయంపై ఈ నెల 8 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బన్సీలాల్, ఎస్సై మాలకొండరాయుడు, సిబ్బంది రంగంలోకి దిగారు. సదరు మహిళ, ఆమెకు సహకరించిన ఇటిక్యాల రవిని వేములవాడ కోర్టు ప్రాంతంలో శనివారం పట్టుకున్నారు. రూ .35 వేలు, తులం బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, బ్యాంకు పాసు బుక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published: