హోమ్ /వార్తలు /క్రైమ్ /

యూట్యూబ్ చూస్తూ ప్రసవానికి యత్నం.. ప్రాణాలు కోల్పోయిన యువతి..

యూట్యూబ్ చూస్తూ ప్రసవానికి యత్నం.. ప్రాణాలు కోల్పోయిన యువతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి గురించి కూడా వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదన్నారు.

  ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. యూట్యూబ్ వీడియో చూస్తూ సొంతంగా ప్రసవానికి ప్రయత్నించిన ఓ యువతి తీవ్ర రక్త స్రావంతో మృతి చెందింది. అవివాహిత అయిన ఆ యువతి ప్రసవాన్ని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే యూట్యూబ్‌ను ఫాలో అయి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది. రక్తపు మడుగులో పడివున్న ఆమెను పక్కింటివారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


  వివరాల్లోకి వెళ్తే.. బహ్‌రాయిచ్ గ్రామానికి చెందిన ఓ యువతి(25) నాలుగేళ్లుగా గోరఖ్‌పూర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఇదే క్రమంలో నాలుగు రోజుల క్రితమే బిలంద్‌పూర్ ప్రాంతంలో ఆమె మరో అద్దె ఇంట్లోకి మారింది. అప్పటికే నెలలు నిండటంతో సోమవారం ఆమెకు నొప్పులు తీవ్రమైనట్టు తెలుస్తోంది. దీంతో యూట్యూబ్ వీడియోను చూస్తూ ప్రసవానికి ప్రయత్నించింది.


  అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయింది. గది నుంచి రక్తం బయటకు రావడంతో పక్కింటివారు విషయాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్‌లోని వివరాల ఆధారంగా ఇంట్లో వాళ్లకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకున్నాక ఆమె మృతదేహాన్ని అప్పగించారు.ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి గురించి కూడా వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదన్నారు.

  First published:

  Tags: Crime, Uttar pradesh, Youtube

  ఉత్తమ కథలు