Home /News /crime /

SINGHU BORDER KILLING NIHANG SARAVJEET SINGH SURRENDER TO POLIC CLAIMS RESPONSIBILITY OF KILLING LAKHBIR SINGH SU

Singhu border killing: రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దుల్లో ఘోరం.. అత్యంత కిరాతకంగా హత్య.. ఈ హత్య చేసింది ఎవరు..?

ప్రతీకాత్మక చిత్రం (Image- Reuters)

ప్రతీకాత్మక చిత్రం (Image- Reuters)

సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్న ప్రధాన వేదిక వద్ద ఉన్న బారికేడ్లకు ఓ వ్యక్తి మృతదేహం కట్టి ఉంచడం తీవ్ర కలకలం రేపింది. ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు, అతడిని చంపింది ఎవరనే.. అనే అంశాలను ఒకసారి చూద్దాం..

ఇంకా చదవండి ...
  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు హర్యానాలోని సోనిపట్ జిల్లా కుండ్లిలోని సింఘు సరిహద్దులో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం రైతులు ఆందోళన చేస్తున్న ప్రధాన వేదిక వద్ద ఉన్న బారికేడ్లకు మృతదేహం కట్టి (Singhu border killing)ఉంచడం కనపించింది. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలుత పోలీసులు అక్కడికి చేరుకునేందుకు రైతులు అనుమతించలేదు. అయితే కష్టం మీద అక్కడికి చేరుకున్న కుండ్లి పోలీస్ స్టేషన్ అధికారులు మృతదేహాన్ని సమీపంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధిచిన కొన్ని వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.

  అయితే ఈ హత్యకు బాధ్యత వహిస్తూ సరవ్‌జిత్ సింగ్ (Saravjeet Singh) అనే నిహంగ్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతడికి వైద్య పరీక్షల కోసం తరలించారు. శనివారం పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిందనే అంశాలను ఇప్పుడు చూద్దాం..

  తొలుత ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఈ హత్య ఎవరూ చేశారనే దానిపై సమాచారం లేదని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో రైతుల నిరసన జరుగుతున్న ప్రదేశంలో చేతులు, కాళ్లు నరికిన ఒక మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ నేరానికి ఎవరూ పాల్పడ్డరానే దానిపై సమాచారం లేదు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం’అని డీఎస్పీ హన్సరాజ్ చెప్పారు.

  16 కిలోల బంగారు చీరలో అమ్మవారు.. వైరల్‌గా మారిన ఫొటోలు.. ఏడాదికి రెండు సార్లు మాత్రమే..

  రైతుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha) నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ.. ఈ హత్య వెనక నిహంగ్ సిక్కుల హస్తం ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమకు వారు మొదటి నుంచి ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణలో తాము పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు.

  స్వరాజ్ ఇండియా కన్వీనర్ యోగేంద్ర యాదవ్ (Yogendra Yadav), భారతీయ కిసాన్ యూనియన్ ( Bhartiya Kisan Union)లు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని వారు కోరారు. విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు.

  మృతుడికి ముగ్గురు పిల్లలు..
  సింఘు సరిహద్దుల్లో హత్యకు గురైన వ్యక్తిని 35 ఏళ్ల లఖ్‌బీర్ సింగ్‌గా (Lakhbir Singh) గుర్తించారు. లఖ్‌బీర్ సింగ్ పంజాబ్‌లోని చీమా ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య జస్ప్రీత్ కౌర్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లల వయసులు 8,10,12 మాత్రమే లఖ్‌బీర్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ కాగా.. అతడి 6 నెలల వయసులోనే వారి బంధువు హర్నామ్ సింగ్ దత్తత తీసుకున్నాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. అతను దళిత వర్గానికి చెందినవాడని, అతనిపై ఎలాంటి నేర చరిత్ర లేదని, రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

  భాద్యత వహించిన నిహంగ్ గ్రూప్.. వీడియో విడుదల..
  ఈ ఘటనకు ‘నిర్వైర్ ఖల్సా-ఉద్నా దళ్’ (Nirvair Khalsa-Udna Dal) గ్రూప్ బాధ్యత వహించింది. ఓ వీడియోలో బల్వీందర్ సింగ్, పంత్- అకాలీ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టుగా చెప్పారు. మత పవిత్రతను దెబ్బతీసే వారిపట్ల తాము ఈ విధంగానే వ్యవహరిస్తామని.. తాము ఏ పోలీసులను, అధికారులను సంప్రదించమని అన్నారు. ఈ మేరకు ఇండియా టూడే రిపోర్ట్ చేసింది. ‘హత్యకు గురైన వ్యక్తి కొన్ని రోజుల క్రితం మా వద్దకు వచ్చాడు. అతడు మా శిబిరంలో సేవ చేశాడు. మా నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఉదయం 3 గంటలకు జరిగే ప్రార్థన సమయంలో అతను పవిత్ర గ్రంథాన్ని కవర్ చేసే వస్త్రాన్ని తొలగించాడు. ఈ విధంగా అవమానించాడు. దీంతో నిహాంగ్స్ అతడిని వెంబడించడంతో పారిపోయాడు. అయితే ప్రైవేటు ఆస్పత్రి వద్ద అతడు చిక్కాడు. అక్కడి ప్రజలు అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత పవిత్ర గ్రంథాన్ని నిహాంగ్స్ బృందం అతని వద్ద నుంచి తిరిగి పొందారు’ అని వారు చెప్పారు.

  బెడ్ కింద నుంచి వింత శబ్దం.. అదేంటో అని చూస్తే షాకింగ్ సీన్.. కట్ చేస్తే..

  24 గంటల్లో నివేదిక సమర్పించండి.. జాతీయ ఎస్సీ కమిషన్
  సింఘు సరిహద్దుల్లో దళిత వ్యక్తి హత్యకు సంబంధించి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని హర్యానా డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ పోలీసును జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా (Vijay Sampla) కోరారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కూడా ఆయన కోరారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి డీజీపీ, హోం కార్యదర్శి సహా ఇతర సీనియర్ అధికారులతో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

  పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో..
  అధిక రక్తస్రావం కారణంగా లఖ్‌బీర్ సింగ్‌ మరణించినట్టుగా పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైంది. అతడి శరీరంపై గాయాలు కూడా ఉన్నట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. ఆయుధంతో దాడి చేయడంతో అతడు మృతిచెందాడని పేర్కొంది. అతని శరీరంపై కనీసం 10 గాయాల గుర్తులు ఉన్నాయని తెలిపింది. ఇక, అతని ఒక చేయి నరికివేయబడిందని, మరొక చేతిని శరీరం నుండి వేరు చేశారని, కాలు కూడా కత్తిరించబడిందని పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొనట్టుగా ఇండియా టూడే తెలిపింది.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Farmers Protest, Haryana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు