దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో వరుసగా చోరీలు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత సింగర్ కే.జే ఏసుదాసు(K.J Yesudas) కుమారుడు విజయ్ ఏసుదాసు (Vijay Yesudas) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు వజ్రాలు పొదిగిన నగలు (Jewelry)మాయమైపోయినట్లుగా విజయ్ భార్య దర్శన చెన్నై (Chennai)పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాదు నగలు కనిపించకపోవడం పట్ల పని మనుషులపైనే అనుమానం ఉందంటూ కంప్లైంట్‌లో పేర్కొనడంతో పోలీసులు చోరీ కేసును చేధించి దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు. కొద్ది రోజుల క్రితమే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth)ఇంట్లో కూడా ఇదే తరహాలో చోరీ జరిగింది. ఈకేసులో కూడా పని మనిషే నిందితురాలిగా తేలడంతో పోలీసులు అదే విధంగా ఈకేసును విచారిస్తున్నారు.
ఏసుదాసు కొడుకి ఇంట్లో చోరీ ..
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల ఇళ్లలో వరుస చోరీలు జరగడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఇంట్లో దాచి పెట్టిన బంగారు నగలు, వజ్రాల ఆభరణాలు మాయం కావడంతో షాక్ అవుతున్నారు. తాజాగా ఫేమస్ సింగర్ కే.జే ఏసుదాసు కుమారుడు సింగర్ విజయ్ ఏసుదాసు చెన్నైలోని ఆళ్వార్‌పేటలోని అభిరాంపురం 3వ వీధిలో నివసిస్తున్నారు.ఇంట్లో 60సవర్ల బంగారు నగలు మాయమైపోయాయని విజయ్ భార్య, ఏసుదాసు కోడలు దర్శన చెన్నైలోని అభిరామపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో దాచిన 60సవర్ల నగలు చోరీకి గురయ్యాయని..తమకు ఇంట్లో పని చేస్తున్న వారిపైనే అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు సింగర్ విజయ్ సతీమణి. గత ఏడాది డిసెంబర్ 2న ఇంటి లాకర్‌లో సుమారు 60 సవర్ల బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు ఉన్నాయని..గత నెల 18వ తేదిన తీసుకునేందుకు లాకర్ తీసి చూడటంతో లేవని పేర్కొన్నారు.
పని మనుషులపై నిఘా..
అదృశ్యమైన ఆభరణాల కోసం పలు చోట్ల వెతికినా కనిపించకపోవడంతో 30వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ఇంట్లో పనిచేసే మేనక, పెరుమాళ్, సయ్యద్‌లపై కూడా అనుమానం ఉందని గాయకుడు విజయ్ భార్య దర్శన ఫిర్యాదులో పేర్కొన్నారు.సినీ సింగర్ ఏసుదాసు కుమారుడి ఇంట్లో నగల చోరీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం విజయ్ ఇంట్లో పని చేస్తున్న వాళ్లతో పాటు గతంలో పని చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
ఇంటి దొంగలే ..
రీసెంట్‌గా రజనీకాంత్ కుమార్తె, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కూడా చోరీ జరిగింది. ఇంట్లో పని చేస్తున్న మహిళ ఈశ్వరి ఈచోరీ చేసినట్లుగా తేల్చారు. ఆమె దగ్గర నుంచి 60సవర్ల నగలను రికవరీ చేశారు పోలీసులు. ఇప్పుడు అదే తీరుగా మరో ఫిర్యాదు రావడంతో పని మనుషులు, ఇంట్లో సిబ్బందిని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: K. J. Yesudas, Kollyood News, Tamilnadu