విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. మూడేళ్లలో 160 మంది మహిళలను..

ప్రతీకాత్మక చిత్రం

వీడియోలను ఒక్కసారి కాకుండా పాఠశాలలో నిర్వహించిన వివిధ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఆ సమయంలో 160 మంది మహిళలు తమ దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చీత్రికరించాడు.

  • Share this:
    ఓ వ్యక్తి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు. అతడి పని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం. కానీ అతడు మూడేళ్ల కాలంలో 160 మంది మహిళల అసభ్యకర వీడియోలు చీత్రికరించాడు. వాటిని చూపిస్తూ తనకు లొంగకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ ఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగపూర్‌కు చెందిన ఓ మూడేళ్ల వ్యక్తి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతడు పాఠశాలలో చేరిన మూడేళ్ల కాలంలో దాదాపు 160 మంది మహిళల పట్ల అసభ్యకర వీడియోలను తీశాడు. వీడియోలను ఒక్కసారి కాకుండా పాఠశాలలో నిర్వహించిన వివిధ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఆ సమయంలో 160 మంది మహిళలు తమ దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చీత్రికరించాడు.

    ఆ వీడియోలను వారికి చూపిస్తూ తనకు లొంగాలని లేకుంటే సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. సదరు ఉపాధ్యాయుడి వేధింపులను భరించలేక కొంతమంది మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలావుంటే ఏప్రిల్ 2015 నుంచి జూలై 2018 మధ్య ఈ వీడియోలను తీశాడు.

    ఇందులో తొలి ఎనిమిది వీడియోలను 2015 ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు, తర్వాత ఎనిమిది వీడియోలను 2016 సంవత్సరంలో మొదటి ఆరు నెలలు తీశాడు. 2017 సంవత్సరం నాటికి ఆ వీడియోల సంఖ్య 105కు చేరింది. ఈ విషయం తెలిసిన స్కూల్ యాజమాన్యం 2018 జూలైలో అతడిని విధుల నుంచి తొలగించింది.
    First published: