రిటైర్డ్ జడ్జి ఇంటి ఎదుట కోడలు ఆందోళన.. ఒక కుమార్తె అప్పగింత

వైపు పోలీసులు కేసును విచారిస్తుండగా, మరోవైపు చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. ఇద్దరు పసిబిడ్డలను తల్లికి అప్పగించాలని సూచించింది. ఈ క్రమంలో చిన్న కుమార్తె శ్రీవిద్యను తల్లి సింధూశర్మకు అప్పగించారు.

news18-telugu
Updated: April 28, 2019, 7:06 PM IST
రిటైర్డ్ జడ్జి ఇంటి ఎదుట కోడలు ఆందోళన.. ఒక కుమార్తె అప్పగింత
జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కుటుంబం (File)
news18-telugu
Updated: April 28, 2019, 7:06 PM IST
హైదరాబాద్, మద్రాస్ హైకోర్టుల్లో జడ్జిగా పనిచేసిన జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసం ఎదుట ఆందోళన చేస్తోంది. భర్త వశిష్ఠ, అత్తమామలు తనను వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆమె హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఏకంగా ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఆమె ధర్నా చేయడంతో వెంటనే మహిళా సంఘాలు కూడా సింధూ శర్మకు మద్దతు పలికాయి. ఓ వైపు పోలీసులు కేసును విచారిస్తుండగా, మరోవైపు చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. ఇద్దరు పసిబిడ్డలను తల్లికి అప్పగించాలని సూచించింది. ఈ క్రమంలో చిన్న కుమార్తె శ్రీవిద్యను తల్లి సింధూశర్మకు అప్పగించారు. పెద్ద కుమార్తె (3.5సంవత్సరాలు) ఈనెల 29న (సోమవారం) భరోసా సెంటర్‌కు తీసుకుని వెళ్తారని తెలుస్తోంది. అక్కడ భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డను ఎక్కడ ఉంచాలనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...