కొన్ని రోజులుగా జవాన్లు తమ సహాచర ఉద్యోగులపై కాల్పులు జరపడం కలకలంగా మారింది. ఇప్పటికే అనేక చోట్ల జవాన్లు.. కంట్రోల్ తప్పి తమ తోటి ఉద్యోగులపై కాల్పులకు తెగబడ్డారు. ఇలాంటి మరోఘటన వెలుగులోనికి వచ్చింది. ఢిల్లీలోని హైదర్ పూర్ లో మరో కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. అక్కడ వాటర్ ఫ్లాంట్ లో నియమించిన పోలీసులలో.. ఒక సిక్కిం (Sikkim) పోలీసు ప్రబీన్ రాయ్.. మరో ముగ్గురిపై ఇష్టమోచ్చినట్లు కాల్పులకు తెగబడ్డాడు.
దీంతో అక్కడున్న భద్రత సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోనే చనిపోయారు. మరోక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఫైరింగ్ కు పాల్పడిన పోలీసు సిబ్బందిని అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేట్టారు. పోలీసుల విచారణలో ప్రబీన్ రాయ్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తన భార్య పట్ల తోటి ఉద్యోగులు అసభ్యంగా మాట్లాడారని అందుకు కాల్చేశానని ఉన్నతాధికారులకు తెలిపాడు.
ఇదిలా ఉండగా ఏపీలో గతంలో కాల్పులు జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అదికూడా ఓ మహిళతో మాట్లాడుతున్న సమయంలో దుండగులు అకస్మాత్తుగా దాడికి దిగారు.. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిని హత్య (Murder) చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ దాడికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా.. పాత గొడవలే కారణమని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారం పేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. సర్పంచ్‌తో మహిళ మాట్లాడుతున్న సమయంలో… ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో సర్పంచ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని భావిస్తున్నారు.
ఈ ఘటనలో వెంకటరమణకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను (Finger prints) సేకరించారు.
స్వల్ప గాయాలతో తప్పించుకున్న సర్పంచ్ వెంకటరమణ ను .. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రిమ్స్ లో చికిత్స అనంతరం ఈ తెల్లవారుజామున డిశ్చార్జ్ అయ్యారు. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi police, Gun fire